వైఎస్ ఆశయాల సాధన జగన్‌తోనే సాధ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఆశయాల సాధన జగన్‌తోనే సాధ్యం

వైఎస్ ఆశయాల సాధన జగన్‌తోనే సాధ్యం

Written By news on Wednesday, February 26, 2014 | 2/26/2014

వైఎస్ ఆశయాల సాధన జగన్‌తోనే సాధ్యం
 రైతుల కష్టాలను కడతేర్చింది వైఎస్సే..
 తెలంగాణలోనూ వైఎస్‌ఆర్ సీపీ విజయం తథ్యం
 పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 
 మణుగూరు, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను సాదించగల సత్తా జగన్‌మోహన్‌రెడ్డికి మా త్రమే ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖ మ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మణుగూరులోని మార్కెట్ యార్డు ఆవరణంలో మంగళవారం జరిగిన పార్టీ పినపాక నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలను కడతేర్చారని, దేశానికి వెన్నెముక అయిన అన్నదాత చల్లగా ఉంటేనే అందరూ సుభిక్షంగా ఉంటారని భావించారని అన్నారు. ఆయన ప్రజల మనసులో ఇంకా బతికే ఉన్నారనడానికి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు జిల్లాలో వైసీపీ బలపర్చిన 207 మందిని గ్రామ సర్పంచులుగా గెలిపించారని అన్నారు.
 
   వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే జగన్ రాకను చూసి కొందరు భయపడుతున్నారని, తెలంగాణలో ఆయన పర్యటనను అడ్డుకుంటామనడం సరైంది కాదని అన్నారు. దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రజాస్వామ్య దేశంలో వారి భావాలను చెప్పుకునే అవకాశం అందరికీ  ఉంటుందని అన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం అంటే ఆయన ప్రభంజనాన్ని చూసి భయపడటమేనని అన్నారు. మార్చి 5న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు జగన్‌మోన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
 
 వైఎస్ అందరినీ ఆదరించారు : పాయం వెంకటేశ్వర్లు
 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకతీతంగా అందరినీ  ఆదరించారని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. వైఎస్ అధికారంలో ఉన్పప్పుడే పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.  తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  వైఎస్‌ను కలిసి, అడిగినవన్నీ కేటాయించారని గుర్తు చేశారు. ఆ రుణం తీర్చుకునేందుకే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్, 108 సర్వీస్, రైతుల రుణాలు, పావలా వడ్డీ వంటి పథకాలతో ఎంతోమంది లబ్ధి పొందారని అన్నారు. జిల్లాలో 35 వేల గిరిజన కుటుంబాలకు సుమారు 2.50 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు.
 
  పినపాక నియోజకవర్గంలోని కిన్నెరసాని, దుమ్ముగూడెం, పులుసుబొంత ప్రాజెక్టులకు నిధులు ఇచ్చారని అన్నారు.  ఆయన ఆశయాలను సాధించగల సత్తా ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి వైఎస్ పథకాలను వివరించి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పొంగులేటి, పాయం వెంకటేశ్వర్లును కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకుడు చాగంటి రవిందర్ రెడ్డి, రైతువిబాగం జిల్లా కన్వీనర్ మందలపు సత్యనారాయణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, భూపల్లి నర్సింహారావు, ఓరుగంటి రమేష్, మండల కన్వీనర్లు కుర్రి నర్సింహారావు, ఆవుల నర్సింహారావు, మాదినేని రాంబాబు, బీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండీ ఖదీర్, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ పాయం ప్రమీల పాల్గొన్నారు.
Share this article :

0 comments: