రాజన్న రాజ్యమే ధ్యేయం:పొంగులేటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న రాజ్యమే ధ్యేయం:పొంగులేటి

రాజన్న రాజ్యమే ధ్యేయం:పొంగులేటి

Written By news on Friday, February 21, 2014 | 2/21/2014

వైఎస్‌ఆర్ సీపీ  ‘ప్రజాచైతన్య యాత్ర’ ప్రారంభసభలో పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 
 పాలడుగు (వైరా), న్యూస్‌లైన్:
 రాజన్న కలలుగన్న రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జగనన్న సారధ్యంలో రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. వైరా నియోజకవర్గస్థాయి ప్రజాచైతన్య యాత్ర(బైక్ ర్యాలీ)ను ఆయన గురువారం వైరా మండలం పాలడుగు గ్రామంలో ప్రారంభించారు.  ఈ యాత్రలో వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ.. మహానేత ఆశించిన సువర్ణ యుగంలో త్వరలోనే వస్తుందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని అన్నారు. మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మళ్ళీ ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు వైఎస్‌ఆర్ సీపీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన అనంతరం పార్టీ చేపట్టిన ఈ ప్రజా చైతన్య యాత్రకు విశేష స్పందన రావడం.. పార్టీపట్ల ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. దీని స్ఫూర్తితో రానున్న ఎన్నికలలో పార్టీ గెలుపునకు శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఫ్యాను గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వైఎస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
 
 ఈ కార్యక్ర మంలో పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్, సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నంబూరి రామలింగేశ్వరరావు, విధ్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి; వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల కన్వీనర్లు షేక్ లాల్‌మహ్మద్, రాయ ల పుల్లయ్య, నల్లమల్ల శివకుమార్, పొన్నెకంటి వీరభద్రం, రావూరి శ్రీనివాసరావు, నాయకులు గుమ్మా రోషయ్య, సూతకాని జైపాల్, తన్నీరు నాగేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు, పూర్ణకంటి నాగేశ్వరరావు,  శాఖమూడి లోకేశ్వరరావు; ఖానాపురం, గరికపాడు సర్పం చులు మారబోయిన ఏడుకొండలు, శీలం కరుణాకర్‌రెడ్డి, చింతనిప్పు వెంకటేశ్వరరావు, బోసు, కౌసర్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
 
 ఏన్కూరు మండలంలో విశేష స్పందన
 ఏన్కూరు: ప్రజాచైతన్య యాత్రకు ఏన్కూరు మండలంలో విశేష స్పందన కనిపించింది. ర్యాలీ అగ్రభాగాన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాణోత్ మదన్‌లాల్, నంబూరి రామలింగేశ్వర్‌రావు తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైరా మండలం నుంచి జన్నారం మీదుగా కోనాయపాలెం, ఏన్కూరుకు ర్యాలీ చేరుకుంది. అక్కడి నుంచి రేపల్లెవాడ, నాచారం, ఒంటిగుడిసె, భద్రుతండా మీదుగా జులూరుపాడు వెళ్లింది. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ముక్తి వెంకటేశ్వర్లు, నాయకులు నల్లమల శివకుమార్, వెంకటేశ్వర్‌రావు, సక్రునాయక్, తంబల్ల రవి, గిదిగిరి సత్యనారాయణ, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 కొణిజర్ల మండలంలో ఉత్సాహంగా...
 
 కొణిజర్ల: వైఎస్‌ఆర్ సీపీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాణోత్ మదన్‌లాల్ నేతృత్వంలో గురువారం చేపట్టిన మోటర్ బైక్ ర్యాలీ(ప్రజా చైతన్యయాత్ర) కొణిజర్ల మండలంలో ఉత్సాహంగా సాగింది. కొణిజర్ల మండలంలోని శాంతి నగర్ వద్ద పార్టీ శ్రేణులు సుమారు 400 ద్విచక్ర వాహనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర పల్లిపాడు, లాలాపురం, తీగలబంజర, మంగాపురం, గుబ్బగుర్తి, అంజనాపురం మీదుగా ఏన్కూర్ మండలానికి వెళ్లింది. ఈ యాత్రను మండల క న్వీనర్ రాయల పుల్లయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాముల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు దొడ్డపిన్ని రామారావు సమన్వయపరిచారు. కార్యక్రమంలో నాయకులు వడ్లమూడి కృష్ణార్జునరావు, తాళ్లూరి చిన్నపుల్లయ్య, ప్రతాపనేని నరసింహారావు, ప్రతాపనేని లక్ష్మినారాయణ, చల్లా నరసింహారావు, మోహన్‌రావు, గుండ్ల వెంకన్న, మోష, చింతల వాసు, చల్లగుండ్ల రామయ్య, తంబి, జాలాది భద్రయ్య, తెల్లబోయిన వెంకయ్య, కాటేపల్లి సీతారామయ్య, రావుల వెంకటనారాయణ, రోషన్ బేగ్, కన్నేటి వెంకటేశ్వర్లు, తల్లపురెడ్డి హనుమారెడ్డి, కావూరి నాగేశ్వరరావు, అయూబ్‌ఖాన్, బండి శ్రీను, రాజా , బానోత్ రవి, మాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 
 కారేపల్లి మండలంలో ఘన స్వాగతం
 
 కారేపల్లి: వైరా మండలం పాలడుగు నుంచి కారేపల్లి మండలంలోని పాటిమీదిగుంపు గ్రామానికి గురువారం సాయంత్రం చేరుకున్న యాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బానోతు మదన్‌లాల్ ఆధ్వర్యంలో సాగిన ఈ యాత్ర (బైక్ ర్యాలీ) పాటిమీదిగుంపు, బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, మొట్లగూడెం, మాణిక్యారం, గాదెపాడు, చర్లపల్లి, బస్వాపురం, సీతారాంపురం, ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్‌తండా గ్రామాల మీదుగా కారేపల్లి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. పాటిమీదిగుంపులో పొంగులేటి, మదన్‌లాల్‌కు  బాజుమల్లాయిగూడెం సర్పంచ్ గుగులోతు సుజాత తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్‌లో జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ.. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చిన వైఎస్‌ఆర్‌ను గిరిజనులు తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2004లోనే వైఎస్‌ఆర్ బీజం నాటారని అన్నారు. ఆయన సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి గడపకు అందాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించటం తెలంగాణ బిడ్డగా అనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి వైఎస్‌ఆర్ రక్త సంబంధీకులే నాయకత్వం వహిస్తారని అన్నారు. అంతకు ముందు ఆయనకు మహిళలు హారతితో ఘన స్వాగతం ఫలికారు.

 పాపకొల్లులో వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ
 
 జూలూరుపాడు, న్యూస్‌లైన్: నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల కష్టాలను తీర్చిన మహనీయుడు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్‌ఆర్ సీపీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాచైతన్య యాత్ర జూలూరుపాడు మండలంలోని పాపకొల్లుకు చేరింది. ఈ గ్రామంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బానోతు మదన్‌లాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు మరువలేనివని అన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, జల యజ్ఞం పథకానికి అత్యధిక నిధులను కేటాయించారని అన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాజన్న రక్త సంబంధీకులే చేపడతారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీని ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి  చేయాలని పిలుపునిచ్చారు.
 
 పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బానోతు మదన్‌లాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం తరువాత పార్టీ తొలిసారిగా చేపట్టిన ఈ బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించడం.. శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం, ఏన్కూరు మీదుగా కారేపల్లి మండలానికి బైక్ ర్యాలీ తరలి వెళ్లింది.
 కార్యక్రమంలో పార్టీ జూలూరుపాడు, కొణిజర్ల, ఏన్కూరు, వైరా మండలాల కన్వీనర్లు పొన్నెకంటి వీరభద్రం, రాయల పుల్లయ్య, ముక్తి వెంకటేశ్వర్లు, ఎస్‌కె.లాల్‌మహ్మద్, నాయకులు అయిలూరి మహేష్‌రెడ్డి, పూర్ణకంటి నాగేశ్వరరావు, నల్లమల శివకుమార్, దారావతు నాగేశ్వరరావు, రామారావు, గుమ్మా రోశయ్య, శీలం ఆదిరెడ్డి, శంకర్‌రెడ్డి, జయపాల్, సురేందర్‌రెడ్డి, చక్రధర్, రాంశెట్టి వీరయ్య, నల్లపాటి రామారావు, చింతా జగన్నాధం, ఆంగోతు ధనమ్మ, బానోతు అనిత, చెవుల కృష్ణారావు, అల్లాడి నరసింహారావు, బానోతు నాగేశ్వరరావు, బిక్కు, తాళ్లూరి లక్ష్మయ్య, అనంతరామయ్య, వాంకుడోతు కృష్ణ, సత్యనారాయణ, కొలిపాక వెంకటేశ్వర్లు,  బానోతు సక్రు, బాదావత్ బాలు, చందర్, సుందర్, మాచినేని శేషగిరి, హేమ్లా, మంగిలాల్, కొర్రా సామ్యా,  మోహన్, సూర్యం, బిక్కు, జానీ, ధర్మా తదితరులు పాల్గొన్నారు
Share this article :

0 comments: