విభజన బిల్లు పార్లమెంట్‌లో పెట్టొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన బిల్లు పార్లమెంట్‌లో పెట్టొద్దు

విభజన బిల్లు పార్లమెంట్‌లో పెట్టొద్దు

Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014

విభజన బిల్లు పార్లమెంట్‌లో పెట్టొద్దు
* సమైక్యమే మా వైఖరి  
లోక్‌సభ స్పీకర్‌కు జగన్ లేఖ
 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరాదన్నదే తమ పార్టీ అభిమతమని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్పీకర్ అన్ని రాజకీయ పార్టీల లోక్‌సభాపక్ష నేతల సమావేశానికి హాజరుకావాలని జగన్‌కు ఆహ్వానం పంపించారు. దానిపై జగన్ సమాధానమిస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. సమయాభావం వల్ల అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలియజేస్తూనే విభజన బిల్లును తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.

విభజన బిల్లును తిరస్కరిస్తూ శాసనసభ తీర్మానం చేసిందని పేర్కొంటూ అలాంటి బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టడం ఏ మాత్రం నైతికం కాదని వివరించారు. రాష్ట్ర విభజన అనేది పూర్తి అప్రజాస్వామికమని తాము భావిస్తున్నందువల్ల ఇప్పటికే దీనిని అనేక వేదికలపై తీవ్రంగా వ్యతిరేకించామని, పార్లమెంటులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని ఆయన స్పీకర్‌కు రాసిన లేఖలో వివరించారు. పార్లమెంటరీ సత్సంప్రదాయాలకు తమ పార్టీ ఎపుడూ కట్టుబడి ఉందని, ఆ విధంగానే అనేక సందర్భాల్లో తాము స్పీకర్‌కు సహకరించామని కానీ విభజన బిల్లు విషయంలో మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని జగన్ తేల్చి చెప్పారు.
 
నేడు ఢిల్లీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులందరూ మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకున్నారు.  మధ్యాహ్న సమయంలో ఢిల్లీ చేరుకునే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సహా, పలు జాతీయ నేతలను కలుసుకోనున్నారు. రాష్ట్ర విభ జనను అడ్డుకోవాలని వారికి విజ్ఞప్తి చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. శాసనసభ్యులు జాతీయ నాయకులను కలిసేటపుడు ఆయన కూడా వారితో వెళతారు.
 
Share this article :

0 comments: