మీరాకుమార్ కు వైఎస్ జగన్ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీరాకుమార్ కు వైఎస్ జగన్ లేఖ

మీరాకుమార్ కు వైఎస్ జగన్ లేఖ

Written By news on Tuesday, February 4, 2014 | 2/04/2014

మీరాకుమార్ కు వైఎస్ జగన్ లేఖ
న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. సమయాభావం వల్ల తాను వ్యక్తిగతంగా పార్లమెంటులో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాలేకపోతున్నానని, తాను రాస్తున్న ఈ లేఖనే పార్టీ వైఖరిగా పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టద్దని, ఆ బిల్లును ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం నైతికంగా సరికాదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని, అసలు విభజన అప్రజాస్వామికమని ఆయన అన్నారు. బిల్లు విషయంలో రాజ్యాంగ విలువలను పాటించాలని కోరారు. పార్లమెంటు సహా అన్ని వేదికలపైనా తాము విభజనను వ్యతిరేకించామని, ఇకపై కూడా వ్యతిరేకిస్తూనే ఉంటామని ఆయన స్పీకర్ మీరాకుమార్ కు లేఖ రాశారు.

కాగా, బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లి ఆయన రాష్ట్రపతిని కలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను ఆమోదించవద్దని ప్రణబ్ ముఖర్జీని వైఎస్ జగన్ కోరే అవకాశముంది.
Share this article :

0 comments: