తెలుగు కాంగ్రెస్‌గా మారుతున్న టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగు కాంగ్రెస్‌గా మారుతున్న టీడీపీ

తెలుగు కాంగ్రెస్‌గా మారుతున్న టీడీపీ

Written By news on Friday, February 28, 2014 | 2/28/2014

'తెలుగు కాంగ్రెస్‌గా మారుతున్న టీడీపీ'
విజయనగరం: కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పార్టీని ఆశ్రయించి.. ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు తెలిపారు. పార్టీ కోసం పనిచేయమంటే పదవులే లక్ష్యంగా పార్టీలు మారుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న చంద్రబాబు ఆ పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారా టీడీపీని తెలుగు కాంగ్రెస్‌గా మార్చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీమాంధ్ర జిల్లాల్లో కూడా వైఎస్‌ఆర్‌ అభిమానులున్నారని సాంబశివరాజు తెలిపారు. తమ పార్టీకి తెలంగాణలోనూ సత్తా చాటుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: