మాట తప్పితే ముట్టడిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాట తప్పితే ముట్టడిస్తాం

మాట తప్పితే ముట్టడిస్తాం

Written By news on Monday, February 24, 2014 | 2/24/2014

కడప: పంటల బీమా విషయంలో మాట తప్పితే వందలాది రైతులతో కలిసి ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్‌సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్చరించారు.
 
 సోమవారం సాయంత్రానికి క్లియరెన్స్  దక్కకపోతే బుధవారం కార్యాలయాన్ని ముట్టడిస్తామని జీఎం నాగార్జునకు అల్టిమేటం జారీ చేశారు. 2011-12 రబీ సీజన్ పంటల బీమాకు సంబంధించి రూ.52 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. సుమారు 39వేల మంది రైతులు శనగ, ఉల్లి పంటలకు ప్రీమియం చెల్లించారు.  ఇంతవరకూ  బీమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ పడటం లేదు.  
 
 ఈవిషయమై  వైఎస్ అవినాష్‌రెడ్డి స్వయంగా జనరల్ మేనేజర్ నాగార్జునతో పలుమార్లు  సంప్రదింపులు నిర్వహించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ,  ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్లు చేయడంతో పాటు లేఖలు కూడా రాశారు. కమిటీలోని ఐదుగురు సభ్యులు సంతకాలు చేశారని,  శనివారం నాటికి తప్పకుండా సీఎండీతో సంతకం చేయించి క్లియరెన్సు ఇప్పిస్తామని జనరల్ మేనేజర్ నాగార్జున ‘సాక్షి’కి ధృవీక రించారు. శనివారం సాధ్యం కాకపోవడంతో మరోమారు వైఎస్ అవినాష్‌రెడ్డి జీఎంతో ఫోన్‌లో  మాట్లాడారు. సోమవారానికి  క్లియరెస్సు ఇప్పిస్తామని, అంతవరకూ ఆందోళన చెందవద్దని జీఎం తెలిపారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉండకపోతే కార్యాలయాన్ని  ముట్టడించేందుకు అన్ని ఏర్పాట్లను వైఎస్ అవినాష్‌రెడ్డి చేస్తున్నట్లు సమాచారం. వందలాది మంది రైతులతో ప్రదర్శనగా వెళ్లి హైదరాబాద్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సమాయత్తం అవుతున్నారు.
 
 తిరిపెం ఇవ్వడం లేదు
 పంటల బీమాపై స్వయంగా , ఫోన్‌ద్వారా ఎన్నో సార్లు మాట్లాడాను..  పరిహారం కోసం రైతులు పడిగాపులు పడుతున్న విషయాన్ని తెలియజేశాం..  రైతులకు తిరిపెం ఇవ్వడం లేదు.. ప్రీమియం చెల్లించినందుకు బీమా ఇస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఫైలుకు క్లియరెన్స్ ఇప్పిస్తే సరి.. లేదంటే బుదవారం హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
Share this article :

0 comments: