రాజన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత

రాజన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత

Written By news on Wednesday, February 26, 2014 | 2/26/2014

రాజన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత
 అద్దంకి, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుకన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత చేకూరుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అలాంటి పరిపాలనను అందించే సమర్థత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ విద్యార్థి విభాగ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నంత యువశక్తి మరే దేశంలో లేదన్నారు. అది గమనించే రాజశేఖరరెడ్డి వారికి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అలాగే ఓబీసీలకు కూడా స్కాలర్‌షిప్‌ను వర్తింపజేశారన్నారు. ఆ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం మూలన పడేయాలని కుట్రలు పన్నుతోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే ఉపకార వేతనాలను సక్రమంగా అందిస్తామని చెప్పారు.
 
  గొడవలు ప్రోత్సహించే వారికి ఓటు వేయకుండా మంచి చేసే నాయకులకు మద్దతిచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.  రాబోయే రోజుల్లో అద్దంకి ప్రాంతంలో పెద్ద పరిశ్రమలు పెట్టించి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే అద్దంకిలో మినీ స్టేడియం, పాలిటెక్నిక్ కళాశాలలను విద్యార్థుల కోరిక మేరకు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నూతలపాటి చక్రవర్తి, మండల యువజన విభాగం నాయకుడు ఇస్లర్ల వెంకట్రావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, విద్యార్థి విభాగం మండల నాయకులు, కే రవి, ఫైజుల్లా, జిల్లా అధ్యక్షుడు రవి, సాయికృష్ణ, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, నర్రా నాగేశ్వరావు, స్థానిక నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు
Share this article :

0 comments: