చంద్రబాబుకు సూటిగా 15 ప్రశ్నలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు సూటిగా 15 ప్రశ్నలు

చంద్రబాబుకు సూటిగా 15 ప్రశ్నలు

Written By news on Monday, March 17, 2014 | 3/17/2014

చంద్రబాబుకు సూటిగా 15 ప్రశ్నలు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి ప్రశ్నల వర్షం కురిపించింది.  ఆయనను సూటిగా అడుగుతూ 15 ప్రశ్నలతో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

ఆమె సంధించిన 15 ప్రశ్నలు ఇవే:

1. చంద్రబాబు నాయుడూ... మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలేదు?

2. సీబీఐ, ఈడీ, ఆర్ఓసీ, ఎస్ఎఫ్ఐఓ, ఏసీబీ విచారణల్ని ఎలా తప్పించుకున్నావ్? ఇందు కోసం ఏయే పార్టీల్ని, వ్యక్తుల్నీ ఎలా ఉపయోగించుకున్నావ్?

3. 1998 జనవరిలో బీజేపీ వాళ్ళు నిన్ను శిశుపాలునితో పోలుస్తూ..  నువ్వు చేసిన 100 ఘోరాలు - నేరాలను 'ప్రజాకోర్టులో బీజేపీ చార్జిషీట్' పేరుతో ప్రచురించారు.  మీరు వెంటనే కంగారుపడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బీజేపీతో డీల్‌ కుదుర్చుకోలేదా?

4. నీ సింగపూర్‌, మలేసియా, ఇతర దేశాల్లో ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి?

5. సీమాంధ్రను దోచుకున్నది, తెలంగాణను సర్వనాశనం చేసిందీ - ఆ దోచుకున్నది సింగపూర్‌లో నువ్వు దాచింది నిజం కాదా?

6. నీ 1999 మేనిఫెస్టోలో నువ్వే చెప్పావు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఫ్లైట్‌ లేదు గానీ, రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ కు విమానం నడిపేలా ఏర్పాటు చేశానని రాసుకున్నావ్. (టీడీపీ 1999 మేనిఫెస్టో - 13వ పేజీ 17వ లైను). రోజూ సింగపూర్‌ ఫ్టైట్‌లో నువ్వు అధికారంలో ఉన్న 9 ఏళ్ళలో తరలించిన క్యాష్‌ ఎంత? గోల్డు ఎంత? డైమండ్సు ఎన్ని? నీ ఫ్యామిలీస్‌లో వాళ్ళు దిగేసుకుంటున్న వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, కెంపులు ఎవడబ్బ సొమ్ము?

7. కోలా కృష్ణమోహన్, దొంగ నోట్ల రామకృష్ణ గౌడ్, భారతదేశంలోనే అతి పెద్ద స్టాంపుల కుంభకోణంలో నిందితుడు తెల్గీ, హసన్‌ ఆలీలతో నీకున్న సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాల మీద విచారణకు నీవు సిద్ధమేనా? మకావో ఐలాండ్సుకు మీరు ఏకంగా 5 పర్యాయాలు డీల్సు కోసం వెళ్ళింది నిజం కాదా?

8. ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేశ్, ఒక నామా నాగేశ్వరరావు, ఒక మురళీమోహన్... ఇలా ఓ 10 మందిని వేల కోట్లకు పడగలెత్తించటం పరిపాలన అవుతుందా? వారి మీదా, నీ మీదా జాయింట్‌గా సీబీఐ లేదా మరో సంస్థతో విచారణ చేయిస్తామంటే నువ్వు రెడీనా?

9. నువ్వు, నీ కుటుంబ సభ్యులు 1994 నుంచి 2014 వరకూ చేసిన విదేశీ పర్యటనలు అన్నింటి మీద విచారణకు నీవు సిద్ధమేనా? అది జరిగితే నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ బయటపడి కనీసం 10 దేశాల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదా? ఈ 20 ఏళ్లలో నీ పాస్‌పోర్టులు, నీ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు, వాటన్నింటి మీద స్టాంపింగ్‌లు, అందులో కాగితాలు చించివేయకుండా రిలీజ్‌ చేయటానికి నీవు రెడీనా?

10. బాలాయిపల్లి భూముల కొనుగోలు మీద విచారణకు నీవు సిద్ధమేనా? నీ తండ్రి నీకు ఇచ్చిన పొలాన్ని ఆయనకే  అమ్మేసినట్టు చూపావు. ఇలాంటి కొడుకు ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? మీ నాన్న పేరు మీద నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ల వ్యవహారంపై దర్యాప్తుకు నీవు రెడీనా?

11. చివరికి నీ తల్లిని కూడా నీ మనీ ల్యాండరింగ్‌ కోసం వాడుకోలేదా? ఏ తల్లి అయినా తన బిడ్డలందరికీ తన ఆస్తిని సమంగా పంచుతుంది. అలాంటిది చిత్తూరు జిల్లాలోని మీ రెండున్నర ఎకరాల నుంచి కోట్ల రూపాయలు పంట పండినట్టు లెక్కల్లో చూపించావు. నీ పొలంలో ఏమన్నా 500 రూపాయల కట్టలు, వెయ్యి రూపాయల కట్టలు పండే చెట్లు ఆ రోజుల్లోనే వేయించావా? తల్లి పేరు మీద మనీ ల్యాండరింగ్‌ చేసి, ఆమెకు ద్రోహం చేసిన నువ్వు అదే బుద్ధితో తెలుగుతల్లికి కూడా ద్రోహం చేసి ఈ రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి విభజనకు అంగీకరించటం నిజం కాదా?

12. జాయింట్‌ అకౌంట్‌లో డబ్బు వేయించుకుని చివరికి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల సొమ్ముని మింగేసిన చరిత్ర నీది కాదా? ఏలేరు స్కాం విచారణను ఎందుకు అడ్డుకున్నావ్? నీ పేరు మీద లేదా నీ బినామీ పేరు మీద ఇప్పటికీ ఆ జాయింట్‌ అకౌంట్‌ అలాగే ఉన్న మాట వాస్తవం కాదా? రైతుల నోరు కొట్టి సొమ్ములు తిన్న నువ్వ - గత 15 ఏళ్ళుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గెలవకుండా పోయిన మాట వాస్తవం కాదా?

13. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయకూడదని విప్‌ జారీ చేసినందుకు మీకు ముట్టింది ఎంత? చిన్న వర్తకుల జీవితాలతో చెలగాటమాడే విదేశీ పెట్టుబడుల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటానికి వీలుగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నీ ఎంపీలు ముగ్గుర్ని గైర్హాజరు చేయించినందుకు ముట్టిందెంత? రామచంద్రాపురం, నర్సాపురం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు ట్రాన్సుఫర్‌ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ మీకు ట్రాన్సుఫర్‌ చేసిన డబ్బు ఎంత? ప్రతిసారీ ఢిల్లీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కళ్ళు గప్పి వైట్‌ కారులో మాయం అవుతున్నారు? ఎవరెవర్ని కలిశారు?

14. రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ ముందు నడుస్తున్న గొర్రె అయితే - మీరు ఆ వెనక నడుస్తున్న గొర్రెలా కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని యథాతథంగా అనుసరించారంటే ఇందులో డీల్‌ ఏమిటి? శాసనసభలో, శాసన మండలిలో, లోక్‌సభలో, రాజ్యసభలో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ మందలో ఓ వీర విధేయమైన గొర్రెలా మీరు నడిచింది ప్రజలు చూడలేదా?

15. మీ అవినీతి సామ్రాజ్యం ఊడలు, కొమ్మలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. దాని మొదలూ వేళ్ళూ విశ్వం అంతా వేళ్ళూనుకుని ఉన్నాయి. నిజాయితీగా రాజకీయాలు చేసేవారే అయితే.. జగన్మోహన్‌రెడ్డిలా ధైర్యంగా కేసులను ఎదుర్కొనేవారు. జైల్లో పెట్టినా తొణకకుండా, బెణకకుండా, రాజీ పడకుండా ప్రజలనే నమ్ముకునే వారు. 14 ఏళ్ళుగా గెలవకపోవడం అంటే రాజకీయంగా యావజ్జీవ కారాగారశిక్షతో సమానం కాదా?. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా ఉరికంబం ఎక్కించడానికి రాష్ట్ర విభజన వద్దన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాస్తవం కాదా?
Share this article :

0 comments: