లోక్ సభ ఎన్నికల షెడ్యూల్-2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్ సభ ఎన్నికల షెడ్యూల్-2014

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్-2014

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి  సంతప్‌కుమార్ బుధవారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్‌ స్థానాలకు, 294  అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా  తొమ్మిది దశల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఏడు, ఎనిమిది దశల్లో పోలింగ్‌ జరగనుంది.

తెలంగాణ :
తొలి విడతలో తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 30 బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ రెండున విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్‌ 9.  ఏప్రిల్‌ 10న  నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉప సంహరణకు  ఏప్రిల్‌ 12 చివరి తేదీ.  

సీమాంధ్ర : రెండో విడతలో సీమాంధ్ర ప్రాంతంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాలకు మే 7 బుధవారం  పోలింగ్‌  నిర్వహిస్తారు.  దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 12న విడుదల చేస్తారు.  నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్‌ 19. ఏప్రిల్‌ 21న  నామినేషన్ల పరిశీలన ఉంటుంది.  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 23.  ఓట్ల లెక్కింపు మే 16న చేపడతారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో  తక్షణం ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.


షెడ్యూల్ వివరాలు:

* ఏప్రిల్ 7న మొదటి విడుత పోలింగ్. ఈ దశలో 6 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహణ.
* ఏప్రిల్ 9న రెండో విడుత పోలింగ్. ఈ దశలో 5 రాష్ట్రాల్లోని 7 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* ఏప్రిల్ 10న మూడోవిడుత పోలింగ్. ఈ దశలో 14 రాష్ట్రాల్లోని 92 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* ఏప్రిల్ 12న నాలుగోవిడుత పోలింగ్. ఈ దశలో 3 రాష్ట్రాల్లోని 5 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* ఏప్రిల్ 17న ఐదోవిడుత పోలింగ్. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 132 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* ఏప్రిల్ 24న ఆరోవిడత పోలింగ్. ఈ దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* ఏప్రిల్ 30న ఏడోవిడత పోలింగ్. ఈ దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* మే 7న 8వ విడుత పోలింగ్. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* మే 12న 9వ విడుత పోలింగ్. ఈ చివరి విడతలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.

తొలిసారి నోటా ....
మొదటిసారిగా తిరస్కరణ ఓటు నోటాను ప్రవేశపెట్టారు. ఈవీఎంలతోనే ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ఖర్చు మదింపునకు ఒక పరిశీలకుడిని ఏర్పాటు చేశారు. తప్పులకు పాల్పడే ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలుంటాయని ఈసీ హెచ్చరించారు. రుతుపవనాలు, విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. ఓటర్ల నమోదుకు మరో అవకాశాన్ని ఇచ్చింది.
Share this article :

0 comments: