మే 7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మే 7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు

మే 7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు

Written By news on Thursday, March 27, 2014 | 3/27/2014

మే 7 తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు
న్యూఢిల్లీ  : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై  సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెల్లడించింది. సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని న్యాయస్థానం పేర్కొంది. దాంతో మే 7వ తేదీ తర్వాతే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రీషెడ్యూల్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
ఓట్ల లెక్కింపు తేదీని కూడా తామే నిర్ణయించనున్నట్లు కోర్టు పేర్కొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలను ఏప్రిల్ 8న (శ్రీరామనవమి) కాకుండా 11వ తేదీన నిర్వహించడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.  దాంతో మొదటి విడత 6వ తేదీన, రెండో విడత పోలింగ్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
Share this article :

0 comments: