ఉత్తుత్తి హామీలే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉత్తుత్తి హామీలే...

ఉత్తుత్తి హామీలే...

Written By news on Friday, March 21, 2014 | 3/21/2014

చదువుపై చంద్రుడి నిర్లక్ష్య మంత్రం..
తొమ్మిదేళ్ల పాలనలో విద్యార్థులపై చిన్నచూపే.
కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, మేనేజ్‌మెంటు సీటు కొనుక్కోవాలన్నా లక్షల రూపాయలు చెల్లించాల్సిందే.
ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం ఇచ్చే రాయితీలు, స్కాలర్‌షిప్పులు మాత్రమే యథాతథంగా కొనసాగేవి. ఇక బీసీ పోస్టు మెట్రిక్ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన ఇచ్చే స్కాలర్‌షిప్పులే గతి. వీటివల్ల ఆ పదేళ్ల కాలంలో లబ్ధిపొందిన విద్యార్థుల సంఖ్య అత్యల్పం.
2002-03లో మాత్రం 3.3 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.78.37 కోట్ల మేర స్కాలర్‌షిప్పులు అందాయి. అదే ఆయన పాలనలో అత్యధిక బడ్జెట్ కేటాయింపు.
2000-01లో కేవలం 18,792 మంది బీసీ విద్యార్థులకు రూ.2.99 కోట్లు మాత్రమే కేటాయించారు.
స్కాలర్‌షిప్పులు, మెస్ చార్జీలు పెంచాలని ఎన్ని ఉద్యమాలు జరిగినా, వాటిని అణిచివేయడమే తప్ప రూపాయి కూడా అదనంగా ఇచ్చింది లేదు.
మెరిట్ ప్రాతిపదికన కాకుండా బీసీలందరికీ స్కాలర్‌షిప్పులు ఇవ్వాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు.
 

ఉత్తుత్తి హామీలే...
 
 ఏప్రిల్‌లోగా 50 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగార్థులకు ఫీజు రద్దు, ఇంటర్వ్యూలకు ఉచిత బస్ సౌకర్యం, 25 రూపాయల దినసరి భత్యం చెల్లింపు
 - చంద్రబాబునాయుడు (ముఖ్యమంత్రి (22-2-1996)
 
 యువతకు నూతన సంవత్సర కానుక.నెలకు వంద రూ పాయల నిరుద్యోగ భృతి- ముఖ్యమంత్రి(19-12- 1995)
 జరిగిందిదీ..
 ఖాళీ పోస్టుల భర్తీపై నిషేధం -ముఖ్యమంత్రి (25-7-1996)
 
 యువతకు అంధకారమే...
 
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడిపోయారు. ప్రతి పౌరుడికీ ఉపాధి కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై అనధికారిక నిషేధం కొనసాగించింది. టీచర్, పోలీసు ఉద్యోగాలు తప్ప మరే ఉద్యోగాలూ ఇవ్వలేదు. కేవలం 2,500 ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగులతో చెలగాటమాడింది. బాబు విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థి లోకం ఉద్యమించింది. ఎన్నికలకు ముందు భారీగా నియామకాలు చేపడతామని చెప్పి, 1996లో అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఉండవని బాబు చేతులెత్తేశారు.


Share this article :

0 comments: