జనభేరి సక్సెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనభేరి సక్సెస్

జనభేరి సక్సెస్

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014



పేదల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఖమ్మం గుమ్మం అక్కున చేర్చుకుంది.  జనభేరి సభకు వచ్చిన జగన్‌కు జిల్లా ప్రజలు ఆప్యాయత, ఆత్మీయత, ఆదరణతో నీరాజనం పలికారు. జిల్లా సరిహద్దు పాకలగూడెం నుంచి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా కనుచూపు మేర జనసంద్రమే. జిల్లా ప్రజలతో పాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి భారీ ఎత్తున జనప్రవాహం కదలడంతో పెవిలియన్‌గ్రౌండ్ పోటెత్తింది. జిల్లాలో సుమారు ఎనిమిది గంటల పాటు సాగిన జననేత పర్యటన ఆద్యంతం జైజగన్ నినాదాల నడుమ ముందుకు కదిలింది.

 పాకలగూడెంలో అపూర్వ స్వాగతం..
 పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం మీదుగా జిల్లాలోని సత్తుపల్లి మండలం పాకలగూడెంలోకి జగన్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రవేశించారు. ఉదయం 9 గంటల నుంచే జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో గురుభట్లగూడెం చేరుకొని ముందస్తుగా అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. పాకలగూడెంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు ఆయనకు స్వాగతం పలకడంతో జిల్లాలో ఆయన పర్యటన ప్రారంభమైంది.

తొలుత పాకలగూడెంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూలీలు, గ్రామ ప్రజలు జేజేలు పలుకుతూ జగన్‌ను జిల్లాలోకి స్వాగతించారు. అనంతరం గంగరాంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరి రామలింగేశ్వరరావు జగన్‌కు సింగరేణి ల్యాంప్ క్యాప్ పెట్టి చమ్మాస్ చేతికిచ్చారు. ఇక్కడి నుంచి సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, తనికెళ్ల వరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా బారులుతీరి జగన్‌కు స్వాగతం పలికారు.

 పోటెత్తిన పెవిలియన్ గ్రౌండ్..
 జనభేరి సభతో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ పోటెత్తింది. రాత్రి ఏడు గంటలకు తనికెళ్ల మీదుగా జగన్ పర్యటన ఖమ్మం చేరుకుంది. అప్పటికే శ్రీశ్రీ సెంటర్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ఎటు చూసినా జనమేజనం. ఇల్లెందు క్రాస్‌రోడ్డు, రాపర్తినగర్ మీదుగా జగన్ వాహన శ్రేణి రాత్రి ఏడున్నర గంటలకు పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుంది. అప్పటికే గ్రౌండ్ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచే జిల్లాలోని నలుమూలల నుంచి జనం సభకు తరలివచ్చారు.

జగన్ వేదిక పైకి రాగానే ..‘ జై జగన్.. వైఎస్‌ఆర్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభావేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. గ్రౌండ్‌తో పాటు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, భక్తరామదాసు కళాక్షేత్రం, మయూరిసెంటర్, బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా.. జనం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి జగన్ ఒక్కొక్కటిగా వివరిస్తుండగా జనం ఉత్సాహంతో జేజేలు పలికారు. సుమారు అర్ధగంట పాటు జగన్ ప్రసంగం కొనసాగింది. భారీగా సభకు జనం తరలిరావడంతో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను సభ వేదిక పైన ఏర్పాటు చేశారు.
 
 ఆకట్టుకున్న జగన్..
 జగన్ తన ప్రసంగంలో మహానేత పాలనలో సువర్ణయుగం, పేదోడికి జరగిన లబ్ధి, ప్రస్తుత స్వార్థ రాజకీయాలను ఒక్కొక్కటిగా  వివరిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ‘ఖమ్మం ప్రజలు చూపిస్తున్న ఆప్యాయత, ఆదరణ, అభిమానం.. ఎప్పటికీ మరువలేనంటూ’ ఆయన ప్రసంగించడంతో జనం ఒక్కసారిగా రెట్టింపు ఉత్సాహంతో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, సబ్‌ప్లాన్ పథకాల గురించి వివరిస్తూ పేద ప్రజల గుండెలను తట్టి మరోమారు జనభేరి సాక్షిగా మహానేతను గుర్తు చేశారు.

 పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత మహానేతకే దక్కిందని, అందుకే ప్రతి పేదవాడు ఇప్పటికీ, ఎప్పటికీ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తమ గుండెల్లో పదిలంగా నిలుపుకున్నారన్నారు. దీనికి నిదర్శనం.. జిల్లాలో జనభేరి సభ అన్నారు. ప్రతి పేదోడి గుండెల్లో వైఎస్ బతికిఉన్నారనడానికి జిల్లా ప్రజలే  నిదర్శనమని జగన్ ప్రసంగించడంతో గ్రౌండ్ అంతా వైఎస్ నినాదాలు మిన్నంటాయి.

 ఆలస్యంగా వచ్చినా  అక్కున చేర్చుకొని..
  ఉదయం 11 గంటలకే జిల్లాలోకి జగన్ ప్రవేశించాల్సి ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఆయనకు ఘన స్వాగతం పలకడంతో జిల్లా సరిహద్దులోకి మధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చారు. సత్తుపల్లి మండలం పాకలగూడెం నుంచి మొదలైన పర్యటన ఖమ్మం వరకు 95 కిలోమీటర్లు ఐదున్నర గంటల పాటు సాగింది. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, కూలీలు, యువకులు, విద్యార్థులు జగన్ కాన్వాయ్‌ను ఆపి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలకడంలో పోటీపడ్డారు. ప్రతిచోటా ప్రతి ఒక్కరికి కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. పెవిలియన్ గ్రౌండ్‌కు సాయంత్రం 4 గంటలకే రావలసి ఉండగా ఎక్కడికక్కడ ప్రజలను పలకరిస్తూ  రాత్రి ఏడున్నర గంటలకు  చేరుకున్నారు. జగన్‌ను చూడాలని, ప్రసంగం వినాలని ఆలస్యమైనా అశేషజనవాహిని వేయి కళ్లతో ఎదురుచూసింది.

 జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయంవెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయ కర్తలు బాణోతు మదన్‌లాల్, ఎడవల్లి కృష్ణ, సామాన్యకిరణ్, నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్. తెల్లం వెంకట్రావ్, నేతలు సాధు రమేష్‌రెడ్డి, తోట రామారావు, భుక్యా దళ్‌సింగ్, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మెండెం జయరాజు, ఎండీ ముస్తఫా, చాగంటి వసంత, చాగంటి రవీందర్‌రెడ్డి, కూరాకుల నాగభూషణంతో పాటు రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు గట్టు రామచంద్రారావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు జనక్‌ప్రసాద్, పార్టీ సీఈ సభ్యులు రెహ్మాన్, విజయారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి , వీఎల్‌ఎన్‌రెడ్డి , వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఆ జిల్లా నేతలు పాదూరి కరుణ, యర్నేనేని బాబు, బీరవోలు సోమిరెడ్డి, ఇంజం నర్సిరెడ్డిలతో పాటు లక్షలాది మంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this article :

0 comments: