జననేతకు ఘన వీడ్కోలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జననేతకు ఘన వీడ్కోలు

జననేతకు ఘన వీడ్కోలు

Written By news on Monday, March 3, 2014 | 3/03/2014

జననేతకు ఘన వీడ్కోలు
తిరుమల, న్యూస్‌లైన్ : శ్రీవారి దర్శనానికి వచ్చిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద ఓఎస్‌డీ దామోదరం సాదరంగా ఆహ్వానించారు. ఆలయంలో డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల వాహనం వరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఇదే సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీ.పెంచలయ్య, మన్నెం శ్రీనివాసులురెడ్డి, నెమ్మలి పార్థసారధిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, తిరుమల పట్టణ అధ్యక్షుడు రాచవేటి చిన్నముని, చందూరాయల్, మురళి, హర్ష, మాధవనాయుడు, చింతారమేష్ యాదవ్, వంశీ , పలువురు నేతలు ఉన్నారు.
 
విమానాశ్రయంలో..
 
రేణిగుంట: వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం ఉదయం ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆర్‌కే.రోజా, ఆదిమూలం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్ర వర్మ, యువత విభాగం జిల్లా కన్వీనర్ ఉదయ్‌కుమార్, తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, తిరుమలరెడ్డి, నాయకులు చింతమాకుల పుణ్యమూర్తి, వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి, సిరాజ్‌బాషా, రేణిగుంట మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, టౌన్ కన్వీనర్ నగరం భాస్కర్‌బాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దయాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎంజీ రాజేష్‌రెడ్డి, కార్యకర్తలు వీడ్కోలు పలికారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
 
Share this article :

0 comments: