బాబుకు ఓటడిగే ధైర్యముందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు ఓటడిగే ధైర్యముందా?

బాబుకు ఓటడిగే ధైర్యముందా?

Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014

జగన్ తో మళ్లీ సువర్ణ పాలన
 కర్నూలు జిల్లా పర్యటనలో వైఎస్ విజయమ్మ ఉద్ఘాటన
 

 బాబుకు ఓటడిగే ధైర్యముందా?

 ‘‘చంద్రబాబూ నువ్వు రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు? తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేయకపోయినా నువ్వు.. రామోజీరావు, సీఎం రమేశ్, మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి వంటి వారికి మాత్రం రాష్ట్రాన్ని దోచి పెట్టావు. చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని తెహల్కా డాట్ కామ్ ఏనాడో చెప్పింది. నాడు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బెల్ట్‌షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన ఘనత చంద్రబాబుదే. ఆడపిల్లలు పుడితే రూ. 5వేలు, మహిళలకు బంగారు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయని నీకు ఓటు అడిగే దమ్ము, ధైర్యం ఉందా చంద్రబాబూ?’’    - విజయమ్మ

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేసీ కాల్వల పరిధిలో రైతులు ఏడాదికి రెండుసార్లు పంటలు పండించుకున్నారు. రైతులు ధర్నా చేసే అవకాశమే రాకుండా ఆయన పాలన సాగించారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ గుడిసే లేని రాష్ట్రం చేయాలన్న తలంపుతో ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి పేదల సొంతింటి కల నెరవేర్చారు. జగన్ బాబు కూడా నాన్నలాగానే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. వైఎస్.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా 1నే పింఛన్ అందించారు. అభయహస్తం పథకం పేరుతో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. వైఎస్ మరణంతో ఈ పథకంతోపాటు ఎన్నో పథకాలు మూలనపడ్డాయి. వైఎస్సార్ సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా అమలు కావాలంటే అది జగన్‌తోనే సాధ్యమవుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రంలో వైఎస్సార్ సువర్ణ పాలనను తిరిగి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. అమ్మ ఒడి, వృద్ధులకు రూ.700 పింఛన్, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ పథకాలపై జగన్‌బాబు హామీ ఇచ్చార న్నారు. రెండో రోజు శుక్రవారం ఆమె కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, వెంకటాపురం, నంద్యాలలో విజయమ్మ రోడ్‌షో, బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు.
Share this article :

0 comments: