ఇది నీ హిస్టరీ.. మిస్టర్ గజినీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది నీ హిస్టరీ.. మిస్టర్ గజినీ

ఇది నీ హిస్టరీ.. మిస్టర్ గజినీ

Written By news on Sunday, March 23, 2014 | 3/23/2014

ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్న బాబుది
..లక్షమందిని ఇంటికి పంపించే విజన్

 -   రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో సగానికి సగం మందిని సాగనంపేందుకు పథక రచన
 -     వారిని ఏటా 1.9 శాతం చొప్పున తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో అధికారిక ఒప్పందం
 -     విజన్ 2020 నాటికి కనీసం లక్ష వుందిని ఇంటికి పంపుతానంటూ పెద్దన్నకు హామీ
 -    1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందికి ఉద్వాసన
 -    ‘గోల్డెన్ హాండ్‌షేక్’ పేరుతో సాగనంపే యత్నం
 -    నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లుల మూత. నిజాం సుగర్స్,   ఆల్విన్ వాచ్ కంపెనీకీ అదే గతి
 
 ఉద్యోగులను తొలగిస్తాం
 రూ.2 కిలో బియ్యం పథకాన్ని కొద్దిమందికే పరిమితం చేస్తున్నాం. మద్యనిషేధాన్ని రద్దు చేశాం. విద్యుత్ చార్జీలను, నీటి తీరువాను పెంచాం. ప్రభుత్వరంగ సంస్థల్లో, సహకార సంస్థలో ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేస్తున్నాం
 - మే, 1998న ప్రపంచ బ్యాంకుకు బాబు లేఖ
 
 కె.జి. రాఘవేంద్రరెడ్డి: ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు రాసిన లేఖ చూస్తే చాలు.. ఆయన తొమ్మిదేళ్ల పాలన.. విజన్, మైండ్‌సెట్ ఎలా ఉంటుదో ప్రతి ఒక్కరికీ అర్థమైపోతుంది! అలాంటి బాబు ఇప్పుడు ఒక్కసారిగా రూటు వూర్చారు. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ నినాదాలిస్తున్నారు. ఇంటికో ఉద్యోగమిస్తానంటూ నవ్ముబలుకుతున్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల కుటుంబాలున్నారుు. అంటే బాబు గారికి అధికారం అప్పగిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలిస్తారన్నవూట! ఎలాగైనా గద్దెనెక్కేందుకు తానెంతకైనా దిగజారుతానని ఇలాంటి ఆచరణ సాధ్యం కాని హామీల ద్వారా చెప్పకనే చెబుతున్నారు బాబు! కానీ చెరిపేస్తే చెరిగేది కాదు గతం. ఆ గతాన్ని గజనీ బాబు ‘వుర్చిపోయూరేమో’ గానీ రాష్ట్ర ప్రజలు వూత్రం వుర్చిపోలేదు. వుుఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులైతే ఎప్పటికీ వుర్చిపోలేరు కూడా. ఎందుకంటే బాబు తన ఏలుబడిలో వారికి చేసిన ద్రోహం అలాంటిది! అంతటి అన్యాయుం చేసిన పాలకుడు బహుశా చరిత్రలో వురొకరెవరూ కన్పించరు కూడా. అందుకే, బాబు ఇస్తున్న ఎన్నికల నినాదాన్ని చూసి ప్రజలంతా ఫక్కున నవ్వుతున్నారు.
 
 మూసివేత.. తీసివేత
 ఏపీఈఆర్‌పీ కింద తొలి దశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం సుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీల ఉసురు పోసుకున్నారు బాబు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్‌టైల్స్, కోళ్లు-మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగుల పైనా వేటు కత్తి వేలాడింది. 2004 ఎన్నికల్లో బాబు  ఓటమితో వారంతా బయుటపడ్డారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయూ సంస్థలను లాభాల బాట పట్టించి చూపించారు.
 
 ఎందుకో గానీ ఉద్యోగులంటేనే బాబుకు మొదటి నుంచీ ఎక్కడ లేని అలర్జీ. సీఎంగిరీ వెలగబెట్టిన తొమ్మిదేళ్లలోనూ ఆయునలో ఆ ధోరణి అడుగడుగునా కన్పించేది. ఆకస్మిక పర్యటనలు కావచ్చు, వురోటి కావచ్చు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభుత్వోద్యోగులను బాబు బహిరంగంగానే కసురుకునేవారు. డిస్మిస్ చేస్తానంటూ బెదిరించడాన్ని ఊతపదంగా వూర్చుకున్నారు. ఉద్యోగుల ఉసురు పోసుకునే వ్యూహానికి బాబు తన విజన్ 2020లో పెద్దపీట వేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్‌పీ) పేరుతో 1996 సెప్టెంబర్‌లో రహస్య నివేదిక సిద్ధం చేశారు. ఇలాంటి పాపిష్టి ప్రయుత్నానికి పునర్నిర్మాణ పథకమని పేరు పెట్టడం బాబు పాశవిక మైండ్‌సెట్‌కు నిదర్శనం. ఈ పథకంలో భాగంగా ఎప్పుడెప్పుడు ఎంతమంది ప్రభుత్వోద్యోగులను తొలగిస్తానో లెక్కగట్టి మరీ ప్రపంచ బ్యాంకుకు పద్దు రూపంలో సవుర్పించారాయున. ఈ నివేదికను 1997 జనవరిలో విడుదల చేశారు.
 
 పథకం అమలుకు కావాల్సిన రూ.3,320 కోట్లలో రూ.2,173 కోట్లను రుణంగా ఇవ్వాలంటూ ప్రపంచబ్యాంకును ఆశ్రరుుంచారు బాబు. అందుకోసం 1998 మేలో ప్రపంచ బ్యాంకు అప్పటి అధ్యక్షుడు జేమ్స్ ఉల్ఫేన్‌సన్‌కు బాబు లేఖ రాశారు. ‘‘రూ.2 కిలో బియ్యం పథకాన్ని కొద్దిమందికే పరిమితం చేస్తున్నాం. మద్యనిషేధాన్ని రద్దు చేశాం. విద్యుత్ చార్జీలను, నీటి తీరువాను పెంచాం. ప్రభుత్వరంగ సంస్థల్లో, సహకార సంస్థలో ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేస్తున్నాం’’ అంటూ తన ప్రజా వ్యతిరేక నిర్ణయూలన్నింటినీ గొప్పగా అందులో ఏకరువు పెట్టారు. అలా తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారు. బాబు కార్యదక్షతకు మెచ్చిన ప్రపంచబ్యాంకు, ఏపీఈఆర్‌పీ అమలుకు రుణ సాయుం చేసేందుకు అంగీకరించింది. ఇంతటి ఘన చరితుడు బాబు!
 
 ఆ పాలన... నిత్య పీడన
 బాబు అధికారంలో ఉన్నన్ని రోజులూ ఉద్యోగులకు తమను ఎప్పుడు ఇంటికి పంపుతారోననే భయం నిత్యం వెన్నాడుతూనే ఉండేది. అందుకు తగ్గట్టే ఏపీఈఆర్‌పీ పథకంలో కూడా ప్రభుత్వరంగ సంస్థల మూసివేత, ఉద్యోగుల తొలగింపే ప్రధానాంశాలు. ప్రభుత్వోద్యోగులను ఏటా 1.9 శాతం చొప్పున తొలగిస్తానంటూ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రపంచ బ్యాంకుతో బాబు ఏకంగా ఒప్పందమే కుదుర్చుకున్నారు. అందుకనుగుణంగా ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! అలా విజన్ 2020 నాటికి మొత్తం లక్ష వుంది ఉద్యోగులను తొలగిస్తానని ఆయన హామీనిచ్చారు. ప్రజలకిచ్చిన ఏ హామీని నిలబెట్టుకున్న చరిత్ర లేని బాబు, ప్రపంచ బ్యాంకుకిచ్చిన హామీని మాత్రం తూచా తప్పకుండా నిలుపుకునేందుకు శాయుశక్తులా కృషి చేశారు. 2004 మార్చి నాటికి 21 వేల మందిని తొలగించారు. 2004 ఎన్నికల్లో బాబు వుట్టికరవడంతో ఉద్యోగుల తొలగింపుకు బ్రేక్ పడింది. లేదంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వోగులను వేళ్ల మీద లెక్కించాల్సి వచ్చేదేమో! రిటైర్మెంట్‌కు చేరువవుతున్న ప్రభుత్వోద్యోగుల జీవితలతో కూడా చెలగాటవూడిన ఘనత కేవలం బాబుకే దక్కింది. గోల్డెన్ హ్యాండ్ షేక్, స్వచ్చంద పదవీ విరమణ అంటూ ఉద్యోగులను బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు!
 
 బాబూ... బాబోయ్!
*   రాష్ర్ట ప్రభుత్వోద్యోగుల్లో సుమారు సగం మందిని సాగనంపేందుకు బాబు పక్కాగా ప్రయుత్నం చేశారు.
*    1988-93 మధ్యకాలంలో విద్యా రంగంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుదల గణనీయంగా ఉందంటూ వాపోయూరు.
*   1984-85 నుంచి 1996-97 నాటికి రాష్ట్ర సిబ్బంది ఖర్చు 368.2 శాతం పెరిగిందని, దాన్ని తగ్గించాల్సిందేనన్నారు.
*   అందుకోసం సిబ్బంది సమీక్ష సంఘం కూడా వేశారు.
*   2.7 లక్షల ప్రభుత్వోద్యోగాలను సమీక్షించి, ఏకంగా 1.1 లక్షల ఉద్యోగాలు అదనంగా ఉన్నాయుంటూ సంఘం నివేదిక ఇచ్చింది.
*    ఆ నివేదికను అవులు చేసేవాడినేనని, కేవలం 1999 ఎన్నికల దృష్ట్యా అవులును వాయిదా వేయాల్సి వచ్చిందని బాబే స్వయంగా అంగీకరించారు.
 
 వైఎస్: ప్రైవేటీకరణ కాదు... ప్రభుత్వీకరణ!
 2004లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేశారు. అందులో భాగంగా మొదటగా ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. తిరిగి రుణం కోసం ప్రపంచ బ్యాంకు ముందు చేతులు చాచలేదు. రాష్ట్ర ప్రజల, ఉద్యోగుల, నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి జారకుండా చర్యలు తీసుకున్నారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వరంగ సంస్థలు సమర్థంగా నడపగలిగితే లాభాల బాటపడతాయని భావించారు.
 
 అలా చేసి చూపించారు. నష్టాల సాకుతో బాబు హయాంలో మూసేసేందుకు నిర్ణయించిన సింగరేణి, ఆర్టీసీ, మార్క్‌ఫెడ్, జెన్‌కోలతో పాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలూ లాభాల బాట పట్టాయి. దాంతో వాటి ఉద్యోగుల జీవితాల్లో ఆనందం వెల్లివెరిసింది. అంతేనా..?! లక్షలాది ప్రభుత్వోద్యోగాల భర్తీకి వైఎస్ చర్యలు తీసుకున్నారు. తావుు వుళ్లీ వైఎస్ హయూంలోని స్వర్ణయుగాన్ని చవిచూడాలన్నా, అప్పటి ఆనందాలు మళ్లీ వెల్లివిరియాలన్నా యువత ఆలోచనలు తెలిసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమనేది నేటి యువతరం మదిలోని భావన.
 
 వైఎస్ వల్లే బాగుపడ్డాం
 నేను చేనేత సహకార సంఘాన్ని స్థాపించి పదిమందికి జీవనోపాధి కల్పించిన. ఆ తర్వాత పరిస్థితులు తల్లకిందులైనై.  నూలు, రంగుల రేట్లు, కూలిరేట్లు పెరిగినై. వస్త్రానికి గిట్టుబాటు ధర రాక చానా కష్టమైంది. చేసేది లేక ఉపాధి కోసం సూరత్, భీవండి పోయినం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడంతో మా బతుకులు బాగుపడ్డయ్. మాలాంటోళ్ల కోసం ఆయన ఎన్నో పథకాలు పెట్టిండు. పింఛన్ కూడా ఇయ్యడంతో మళ్లీ ఇక్కడికి తిరిగొచ్చినం. ఇప్పుడాయన దయవల్ల సల్లగున్నం. ఇప్పుడు మా కొడుకులు చేనేత సహకార సంఘంలో పనిచేస్తుండ్రు. నా భార్యకు రూ.200 కార్మికుల పింఛన్ అందుతోంది. గిదంతా వైఎస్ పుణ్యమే. ఆ మహానుభావుడి రుణం తీర్చుకోలేనిది.    
 - చేరాల సుధాకర్,
 కమలాపూర్, కరీంనగర్
Share this article :

0 comments: