నరసరావుపేట వేదికగా గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నరసరావుపేట వేదికగా గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావం

నరసరావుపేట వేదికగా గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావం

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014

నేడు జనభేరి
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నరసరావుపేట వేదికగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత అన్ని పార్టీల కంటే ముందుగా జిల్లాలో ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఖమ్మంలో వైఎస్సార్ జనభేరి సభను ముగించుకుని బుధవారం రాత్రి  గుంటూరు చేరుకున్నారు.
 
 =‘వైఎస్సార్ జనభేరి’ పేరిట నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, నాయకులు ఏర్పాట్లు చేశారు.
 
 =ఈ సభలోనే జగన్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తన అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.
 
 =గురువారం ఉదయం 9 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి జగన్ సాయంత్రం 5 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు.
 
 =పేట శివారు జొన్నలగడ్డ రోడ్డులోని అమరా ఇంజినీరింగ్ కళాశాల వద్ద వేలమంది విద్యార్థులు జననేతకు ఘనస్వాగతం పలకనున్నారు.
 
 రెండు లక్షలమందికి వీలుగా ఏర్పాట్లు..
 =జనభేరి సభ ఏర్పాట్లను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
 
 =నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షలకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...
 =భారీ వేదికతో పాటు మహిళల కోసం సభావేదిక వద్ద ఇరువైపులా బారికేడ్లు నిర్మించి ముందుభాగంలో వెయ్యికి పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు.
 
 =నియోజకవర్గాల కన్వీనర్లు, నాయకులు, సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు కూర్చునేందుకు మరో వెయ్యి కుర్చీలు సిద్ధం చేశారు.
 =అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీ చేరనున్న సందర్భంగా సభావేదిక వద్దకు వచ్చే మార్గంలో  స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
 
Share this article :

0 comments: