జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: గౌరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: గౌరు

జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: గౌరు

Written By news on Wednesday, March 12, 2014 | 3/12/2014

జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: గౌరు
 డోన్‌టౌన్, న్యూస్‌లైన్:
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్నకేశవయ్యగౌడ్, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ టీఈ లక్ష్మీదేవితో పాటు మరో 500 మంది మంగళవారం డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కేశవయ్యగౌడ్ దంపతులకు కండువాలు కప్పి గౌరు వెంకటరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్లో వైఎస్‌ఆర్ కుటుంబానికి ఉన్నత స్థానం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు గల్లంతవడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు.
 
  రాష్ట్ర విభజన పాపం టీడీపీదేనని విమర్శించారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ మాజీ డెరైక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి, జిల్లా కో కన్వీనర్ శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వలసల రామక్రిష్ణ, రాచర్ల రాందాసుయాదవ్, రామక్రిష్ణారెడ్డి, న్యాయవాది నర్శింహులు  పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో రమేష్‌గౌడ్, దినేష్‌గౌడ్, రవిశంకర్‌గౌడ్, నాగార్జునగౌడ్, సతీష్‌గౌడ్, మహేష్, చాంద్‌బాషా, భాస్కర్, మల్కన్న, నాగన్న, పెద్ద కాశీం, వీరాంజనేయులు, వెంకటేశు తదితరులు ఉన్నారు.
 
 వైఎస్సార్సీపీలోకి ఆర్‌ఈ రాజవర్ధన్, మాజీ కౌన్సిలర్ సరళమ్మ
 సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆర్‌ఈ రవికుమార్ సతీమణి, మాజీ కౌన్సిలర్ ఆర్‌ఈ సరళమ్మ, ఆమె తనయుడు ఆర్‌ఈ రాజవర్ధన్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక పాతపేటలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరితో పాటు 500 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఆర్‌ఈ రాజశేఖర్, ఆర్‌ఈ రామ్మోహన్, పోస్టుప్రసాద్, మాజీ కౌన్సిలర్ బుర్రు చంద్రశేఖర్‌నాయుడు, ఫరీద్, నాయుడు, శివ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: