శ్రీవారి సేవలో వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీవారి సేవలో వైఎస్ జగన్

శ్రీవారి సేవలో వైఎస్ జగన్

Written By news on Monday, March 3, 2014 | 3/03/2014

శ్రీవారి సేవలో వైఎస్ జగన్
 సంప్రదాయ వస్త్రాలతో దర్శనానికి..
 సాక్షి, తిరుమల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి పాదాల వద్ద ఉన్న తులసి, ప్రసాదాలను జగన్‌కు  అందజేశారు. అనంతరం ఆయన వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత నృశింహస్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ, ప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ శ్రీవారి తీర్థ, అన్న ప్రసాదాలను అందజేశారు. బెల్లం పొంగలి, మిరియాల పొంగలిని వైఎస్ జగన్ స్వీకరించారు. జగన్ శ్రీవారిని దర్శించుకున్న సందర్భంలో సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించారు. పట్టుపంచె, లేత తెలుపు, చారల చొక్కా ధరించి మెడలో పట్టు ఉత్తరీయం వేసుకున్నారు.
 
 ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని..
 ‘రాష్ర్ట ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనృ్నరు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలకు వచ్చిన ఆయనను విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు.  
 
 డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు: చెవిరెడ్డి
 దేవుడి సేవలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో స్వామివారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ‘‘ఈ రాష్ట్రాన్ని పరిపాలించినంతకాలం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రమం తప్పకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తి విశ్వాసాలతో ఆయన వచ్చినన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి కూడా తిరుమలకు రాలేదు.
 
చిన్నతనం నుంచి తండ్రితోపాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేకమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. దేవుడి సేవలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ఆయన వివరణ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి ఆలయంలోకి చెప్పులు వేసుకెళ్లారని గాలి ముద్దుకృష్ణమనాయుడు అబద్ధపుకూతలు కూశారని, ఇకనైనా విజ్ఞతతో వ్యవహరించాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. గుడిలోకి జగన్ చెప్పులు వేసుకుని వెళ్లినట్లు టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు ఒక్కరు చెప్పినా ఏ శిక్షకైనా జగన్ సిద్ధమేనన్నారు.
Share this article :

0 comments: