రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి

రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి

Written By news on Monday, March 31, 2014 | 3/31/2014

రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి
గరికిపాటి ఉమాకాంత్
 ‘‘రాష్ర్ట విభజనతో తెలుగు జాతి రెండు ముక్కలు కాలేదు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిందంతే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి నవతరం ముందుకు రావాలి.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మహా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర ఉండాలి..  తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసమే అభివృద్ధి సాగాలి.. అప్పుడే రెండు రాష్ట్రాలూ భారతదేశానికే తలమానికంగా నిలుస్తాయి..’’ అని తెలుగు సినీపరిశ్రమ దిగ్గజం తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. కొత్త ఆంధ్రప్రదేశ్ వికాసం, నవ తెలంగాణ నిర్మాణం యువతరం వల్లనే సాధ్యమన్నారు. సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన  మనోభావాలు ఇవి...
 
 ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్న భేదం లేకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి  రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇది నేను ఇప్పుడు చెబుతున్నమాట కాదు.. గత ఎన్నికల సందర్భంలోనూ ఇదే విషయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పా. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, సినీదర్శకుడిగా నా నిశ్చితాభిప్రాయమదే. రెండు రూపాయలకే కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, 108, 104, పెన్షన్లు ఇలా ఎన్నో పథకాలతో ఆయన జనానికి దగ్గరయ్యారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజలతో మమేకమైంది వైఎస్సారే. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు కన్నెత్తయినా చూడలేని పేదలకు ఆ ఆస్పత్రుల్లోనే ఉచిత వైద్యం అందించిన రియల్ లీడర్ వైఎస్. విద్య, వైద్యం, గృహనిర్మాణం, రవాణారంగం... సినీపరిశ్రమతో సహా ఇలా అన్ని రంగాలూ ఆయన హయాంలో అభివృద్ధి చెందాయి. అయితే ఆయన మరణానంతరం సంక్షేమ పథకాలన్నీ గాడి తప్పాయి. పరిపాలన అస్తవ్యస్తమైంది. మళ్లీ అవన్నీ గాడిన పడాలంటే ఇరు రాష్ట్రాలకూ సమర్థ నాయకత్వం కావాలి. రెండుచోట్లా రాజకీయాల్లోకి కొత్తనీరు రావాలి. నవతరానికే పట్టం కట్టాలి.
 http://www.sakshi.com/news/elections-2014/tammareddy-bharadwaja-interview-117747?pfrom=home-latest-story
Share this article :

0 comments: