చంద్రబాబుకు వైఎస్ఆర్ సిపి ప్రశ్నలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు వైఎస్ఆర్ సిపి ప్రశ్నలు

చంద్రబాబుకు వైఎస్ఆర్ సిపి ప్రశ్నలు

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

చంద్రబాబుకు వైఎస్ఆర్ సిపి ప్రశ్నలుఎంవిఎస్ నాగిరెడ్డి
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవిఎస్ నాగిరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేశారన్న భావన ఆయన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు నాగిరెడ్డి ప్రశ్నలు:
1. ఉగాది అంటే అచ్చమైన తెలుగువారి పండుగ. రైతుల పండుగ.వ్యవసాయానికి సంబంధించిన పండుగ. వ్యవసాయం దండుగ అన్న మీరు చివరకు ఈ రాష్ట్రం ఒక్కటిగా ఉండటమే దండగ, తెలుగువారంతా కలసి ఉండటమే దండగ అనే సిద్ధాంతాన్ని నమ్మి రైతుల్ని, రాష్ట్రాన్ని, తెలుగువారిని సర్వనాశనం చేశారన్నది నిజంకాదా?
2. వికృత నామ సంవత్సరంలో పుట్టిన మీకు ఉన్నవన్నీ వికృతపు ఆలోచనలు కాదా?
3. చింతపండు మీద కూడా పగబట్టి గిరిజన కార్పొరేషన్‌ను సర్వనాశనం చేసింది మీరుకాదా?
4. 1994 నుంచి 2004 వరకూ మీ పాలనలో వ్యవసాయం పడకేసిన మాట నిజం కాదా?
5. చంద్రబాబూ...నిర్మాణం అంటే మీ దృష్టిలో హైటెక్‌సిటీ కాంట్రాక్టు ఇచ్చి 2 బిల్డింగ్‌లు ఫ్రీగా కట్టించుకోవడమా?
6. నీటికోసం గ్రామాల మధ్య యుద్ధాలు జరిగి, కత్తులతో నరుక్కున్న కాలం మీ పాలన కాదా?
7. మీ పాలనలో 15వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే రుణ మాఫీ ఒక్క రూపాయి అయినా చేయించారా? రైతుల కరెంట్ బకాయిలు ఏనాడైనా రద్దుచేసిన చరిత్ర మీకుందా?
8. మీ 9 ఏళ్ల పాలనలో ఎన్నివేల కోట్ల రూపాయలు పన్నులుగా వడ్డించారు?
9. మ్యాక్స్ చట్టంతో రైతుల చేతుల్లో ఉన్న పాల కేంద్రాలను మీ మనుషులతో కబ్జా చేయించింది నిజం కాదా?
10. విద్యుత్ బకాయిలు చెల్లించని రైతులపై విద్యుత్ చౌర్యం కేసులు పెట్టేలా జీవో 89, 99 తీసుకొచ్చింది మీరు కాదా?
11. ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నం  పూర్ణకుంభం - రైతు, వ్యవసాయం, పల్లె, తెలుగుతనం కలిస్తే పూర్ణకుంభం చిహ్నం - రాష్ట్ర విభజనలో ఇటలీ మాతకు అండగా నిలిచిన మీరు పూర్ణకలశంలోని కొబ్బరికాయను రెండు ముక్కలుగా కొట్టాలన్నారు. ఇన్ని చేసిన మీరు ఏ జాతికి నాయకుడు? ఏ రైతుకు మేలు చేస్తారు?, ఏ నిర్మాణం చేపడతారు?
12.యుగాంతానికి తప్ప మీరు ఉగాదికి మీరు పనికొస్తారా?
13. మీ పాలనలో ప్రజలు ఏనాడైనా ఉగాది జరుపుకున్నారా?
Share this article :

0 comments: