నగరిలో ప్రచార నగారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నగరిలో ప్రచార నగారా

నగరిలో ప్రచార నగారా

Written By news on Wednesday, March 26, 2014 | 3/26/2014

నగరిలో ప్రచార నగారా
 సాక్షి ప్రతినిధి, తిరుపతి :  నగరి నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్ సీపీ జెండా ఎగురనుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రధానంగా వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొంది.  నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు గెలిచారు. ప్రస్తుతం ఆయన గాలి తగ్గింది. మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు గెలుపు బాటలో ఉండటంపై టీడీపీలో ఆందోళన మొదలైంది.  ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ సీపీ తరఫున శాసనసభకు ఆర్‌కే.రోజా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం నిరంతరం ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ముద్దుకృష్ణమనాయుడు తనతో పాటు కుమారులను కూడా ప్రచారంలోకి దించారు.

 నగరిలో...
 నగరిలో 27 వార్డులు ఉన్నాయి. ఇందులో 18 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎనిమిది స్థానాల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏడవ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడు. మున్సిపాలిటీలో 39,442 మంది ఓటర్లు ఉన్నారు. మొదలియార్(బీసీ) వర్గానికి చెందిన ఓట్లు 17వేల వరకు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఓట్లు వైఎస్‌ఆర్ సీపీ వైపే ఉన్నాయని అన్ని పార్టీల వారు అంగీకరిస్తున్నారు. నగరిని మున్సిపాలిటీ నుంచి రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు గతంలో అక్కడి కొంతమంది మొదలియార్‌లకు హామీ ఇచ్చారు. ఈయన హామీలు కేవలం మాటలకే పరిమితమని ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక సుమారు 4000 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు తప్పకుండా వైఎస్‌ఆర్ సీపీకే పడతాయనేది స్థానికుల వాదన.

 పుత్తూరులో...
 పుత్తూరులో 24 వార్డులు ఉన్నాయి. 34,333 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మొదలియార్ ఓట్లు ఏడు వేల వరకు ఉన్నాయి. ఎస్సీ ఓటర్లు 3,323 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఎక్కువ మంది వైఎస్‌ఆర్ సీపీ వైపే ఉన్నారు. వైఎస్‌ఆర్ సీపీ వారు డీఎన్ ఏలుమలై(అమ్ములు)ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా ఇతర కులాలకు చెందిన ఓట్లు 14,475 ఉన్నాయి. ఇందులో కాపురెడ్డి, క్షత్రియ, బలిజ, కమ్మనాయుడు, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు.

అన్ని వర్గాల వారు వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు పథకాల ద్వారా లబ్ధిపొందినవారే కావడం విశేషం. ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ఆర్ సీపీని వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లతో తమలోని అనేక మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని వారు బహిరంగంగానే చెబుతున్నారు. పుత్తూరులో 15 నుంచి 18 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ జెండా ఎగురవేస్తుందనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  రెండు మున్సిపాలిటీల్లోనూ తిరుగులేని మెజారిటీతో వైఎస్‌ఆర్ సీపీ ఘనవిజయం సాధిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు
Share this article :

0 comments: