అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

Written By news on Sunday, March 9, 2014 | 3/09/2014

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
జహీరాబాద్, న్యూస్‌లైన్: రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పార్టీ రాష్ట్ర నేత ఉజ్వల్‌రెడ్డి అన్నారు. శనివారం జహీరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఉజ్వల్‌రెడ్డి మాట్లాడారు. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జిల్లాలోని అన్ని స్థానాల్లో బరిలో ఉంటారని స్పష్టం చేశారు. రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ ఎంపికలో కీలకంగా మారుతుందన్నారు. తమ మద్దతు లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా అధికారం చేపట్టడం సాధ్యం కాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో లబ్ధి పొందారని, వారంతా ఆ మహానేత కుటుంబం పట్ల కృతజ్ఞతతో ఉన్నారన్నారు. ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కడతారన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ కావాలని కోరుకుంటన్న ప్రజలు, ఆ మహానేత తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే మళ్లీ స్వర్ణయుగం వస్తుందని ప్రజలంతా భావిస్తున్నారన్నారు.
 
 రాజశేఖరరెడ్డి మరణానంతరం పట్టించుకునే వారే లేక రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వారంతా ఇపుడు మంచి పాలనకోసం, తమను ఆదరించే నేతకోసం ఎదురుచూస్తున్నారన్నారు. వారి ఆకాంక్ష నెరవేర్చడం జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడికే సాధ్యమవుతుందన్నారు. టీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపుతూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి ఓట్లు దండుకునే కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, రెండెకరాల భూమి ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారన్నారు. ఎవరెన్ని హామీలు గుప్పించినా రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపి అఖండ విజయాన్ని అందిస్తారని ఉజ్వల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావు శెట్కార్, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నర్సింహ యాదవ్, సంజీవరెడ్డి, బాబుకుమార్, పార్టీ నాయకులు కలిముద్దీన్, జగన్, వీరారెడ్డి, అలా ఉద్దీన్, అత్తార్, అశ్విన్‌కుమార్, ముర్తుజా పాల్గొన్నారు
Share this article :

0 comments: