ఒక్క హామీనైనా అమలు చేశావా బాబూ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్క హామీనైనా అమలు చేశావా బాబూ?

ఒక్క హామీనైనా అమలు చేశావా బాబూ?

Written By news on Wednesday, March 26, 2014 | 3/26/2014

ఒక్క హామీనైనా అమలు చేశావా బాబూ?
చర్చకు రావాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం సవాల్

 టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారేమో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు రావాలని సవాలు విసిరారు. ఆయన మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ... 1999 ఎన్నికల ప్రణాళికతోపాటు చంద్రబా బు సీఎంగా ఉన్నపుడు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్నైనా అమలు చేశారేమో చె ప్పాలని డిమాండ్ చేశారు.

అధికారంలో ఉన్నపుడు రైతులు, ప్రజల సంక్షేమానికి ఒ క్క పథకమైనా చేపట్టని చంద్రబాబు ఇప్పు డు అన్నీ మాఫీ చేస్తానని హామీలు గుప్పించ డం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మాటలు చూస్తూంటే ‘నేను మాత్రమే ప్రజలను మోసం చేయగలను’ అనే విశ్వాసంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పులు తీర్చలేక రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘం ప్రతినిధులు కోరితే... పరిహారం ఇస్తే రైతులింకా ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు.
 
బిందు సేద్యంపై రైతులకిస్తున్న 50 శాతం సబ్సిడీ చాలదని 75 శాతానికి పెంచాలని రైతు ప్రతినిధులు కోరితే... 50 శాతం భరించలేని రైతులకు అసలు సబ్సిడీనే ఇవ్వొద్దని చెప్పిన ఘనత చంద్రబాబుది. అలాంటి నాయకుడు ఇపుడు 90 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్తే నమ్మగలమా? 2002 మార్చిలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పు డు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20,71, 642 ఉద్యోగాలుండగా 2004లో ఆయన దిగిపోయే నాటికి  20,11,645 మాత్రమే మిగిలాయి. చంద్రబాబు సీఎంగా దిగిపోయే నాటికి రాష్ట్రంలో అతి తక్కువగా 105 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరగ్గా, వైఎస్ సీఎంగా ఉన్నపుడు 204 టన్నులు అత్యధికంగా ఉత్పత్తి జరిగింది.


 బాబు హామీలు నకిలీ స్టాంపుల వంటివే: నాగిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకిస్తున్న హామీ లు నకిలీ స్టాంపులు, దొంగనోట్లు లాంటివేనని వైఎ స్సార్ కాంగ్రెస్ న్యాయవిభాగం సమన్వయకర్త వై. నాగిరెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం పా ర్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడా రు. బాబు పాలనలో నకిలీ స్టాంపులు, దొంగనోట్ల కుంభకోణాలు జరిగాయని గుర్తు చేస్తూ.. ప్రభుత్వంలో ఉన్నపుడు చేయనివన్నీ ఇపుడు చేస్తామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
Share this article :

0 comments: