చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే గతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే గతి

చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే గతి

Written By news on Tuesday, March 4, 2014 | 3/04/2014

నీచ రాజకీయాలకు ఓట్లేయరు
  •     చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే గతి
  •      ప్రజాబాటలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
 తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను తగ్గించేందుకు చంద్రబాబునాయుడు ఎన్ని నీచపు రాజకీయాలు చేసినా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయరని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని తిలక్‌రోడ్డు, దొడ్డాపురం వీధిలో పార్టీ మహిళా నగర కన్వీనర్ చెలికం కుసుమ, బోయళ్ళ రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. సాయంత్రం తిమ్మినాయుడుపాళెం పరిధిలోని రెడ్డిభవనం వద్ద ప్రజాబాట నిర్వహించారు.
 
ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు జనంలో జగన్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని చూడలేక ఎలాగైనా అధికారంలోకి రావాలన్న నీచపు ఆలోచనతో చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జగనన్న మోగించిన ‘వైఎస్‌ఆర్ జన భేరి’ సభకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబునాయుడు గుండెల్లో దడ పుట్టిందన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు బూటు దెబ్బలు, ప్రజలకు లాఠీదెబ్బలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. మంచి చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుని పూజించడం, చెడు చేసిన వాళ్లను చీపుర్లతో తరిమికొట్టడం జనానికి తెలుసన్నారు.

ప్రపంచ రాజకీయాల్లో ఏ నాయకుడు చేయలేనన్ని అభివృద్ధి పనులు చేసిన మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని గుర్తు చేశారు. ఒక్క రోజు కూడా రాష్ట్ర సమైక్యత కోసం కట్టుబడి ఉండని కిరణ్, చంద్రబాబుకు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి, పదవికి రాజీనామా చేసిన ఘనుడు జగనన్న అని గుర్తు చేశారు. ఆయన నిరంతరం ప్రజల అభ్యున్నతికే శ్రమిస్తున్నారన్నారు.

రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నాయకులు ఎస్‌కే. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, ఎంవీఎస్.మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, తాలూరి ప్రసాద్, కట్టాగోపీయాదవ్, తిమ్మారెడ్డి, రాఘవులునాయుడు, రాజేంద్ర, కన్నయ్య, నూరుల్లా, చాంద్‌బాషా, జనార్ధన్, పుణీత, గౌరి, శాంతారెడ్డి, శమంతకమణి పాల్గొన్నారు.
Share this article :

0 comments: