పశ్చిమలో జగన్ కు పోటెత్తిన అభిమానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పశ్చిమలో జగన్ కు పోటెత్తిన అభిమానం

పశ్చిమలో జగన్ కు పోటెత్తిన అభిమానం

Written By news on Sunday, March 16, 2014 | 3/16/2014

పశ్చిమలో జగన్ కు పోటెత్తిన అభిమానంవీడియోకి క్లిక్ చేయండి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 'జనపథం' ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఎండలు మండిపోతున్నప్పటికీ  జిల్లా ప్రజలు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి  బిడ్డను చూడటానికి తరలి వస్తున్నారు.  ఈ నెల14న ప్రారంభమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైన జగన్ ఎన్నికల  ప్రచారం నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకులలో పూర్తి అయింది.  పైడిపర్రు, శివాలయం రోడ్డు, సజ్జాపురం,రాజీవ్ చౌక్, ఇరగవరం కాలనీ, వై జంక్షన్ మీదుగా తణుకు వరకు  జగన్ రోడ్‌షో జరిగింది. తణుకు జనసంద్రమైంది. జగన్ రోడ్ షో తాడేపల్లిగూడెం చేరుకుంది.  ఇది ఎన్నికల ప్రచారం కాదు. పేరుకే ఎన్నికల ప్రచారం. ఇది ప్రజల గుండె చప్పుడు వినే యాత్ర. ప్రజల మనసులను చదివే యాత్ర. మీకు అండగా ఉంటానని చెప్పే యాత్ర. ఓట్లు, సీట్ల కోసం చేసే యాత్ర కాదు. ప్రజల గొంతుక వినడానికి జగన్ ప్రజల మధ్యకు వెళ్లారు.

ఈ రోజు తణుకు, తాడేపల్లి గూడెం జగన్‌ నినాదాలతో మారుమోగిపోయాయి. వైఎస్‌ జగన్‌ను చూడటానికి  వచ్చిన జనాలతో మేడలు, మిద్దెలు నిండిపోయాయి.  ప్రతి వీధిలోంచి జగన్‌ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు కదిలారు.  ఎంత కష్టం వచ్చింది నాయన అంటూ ఓ మహిళ జగన్ దగ్గర కన్నీరు పెట్టుకుంది. విద్యార్థులు  జగన్‌తో మాట్లాడి కరచాలనం చేసి వెళుతున్నారు. తమకు ఓటు హక్కు లేకపోయినా జగన్‌కి ఓటేయ్యమని ప్రజలను అడుగుతామని  విద్యార్థులు చెప్పారు. వృద్దులైతే ''మీ నాయన ఉన్నప్పుడే బాగా చూసుకున్నారు.ఇప్పుడు పట్టించుకనేవారేలేరు'' అని  జగన్‌ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు.  యువకులు, మహిళలు, వృద్దులు, వికలాంగులు భారీ ఎత్తున తరలివచ్చి మద్దతు పలుకుతున్నారు.  తాడేపల్లిగూడెం వాసులు జగన్ కు పూలవాన  ఘనస్వాగతం పలికారు.  భవనాలు ఎక్కి  జగన్‌ను చూడటానికి మహిళలు, యువత పోటీ పడ్డారు. చిన్నారులను ముద్దాడుతూ, వృద్దులను చిరు నవ్వుతో పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు‌. తణుకు, తాడేపల్లిగూడెంలలో నిన్ననే పర్యటించాల్సి ఉన్నప్పటికీ అడుగడుగునా అభిమానం అడ్డుపడుతుండటంతో  షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఎన్నికల ప్రచారం సాగడంలేదు. రేపు  తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారు.

 గుండెలు నిండా అభిమానం నింపుకుని జగన్‌ కోసం తణుకు వాసులు ఎదురు చూడటం కనిపించింది. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని యువకులు అన్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని నాయకుడిగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు  చెప్పారు. వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే నేత అని గోదావరి బిడ్డలు చెబుతున్నారు.  జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతున్నామన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాలంటే వైఎస్‌ జగన్ రావాలని నినదిస్తున్నారు.
 జగన్‌ అధికారంలోకి వస్తే ధైర్యంగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటామని విద్యార్ధినులు చెప్పారు. వైఎస్ఆర్‌ అమ్మ ఒడి పథకం విద్యార్ధుల పాలిట కల్పవృక్షం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. జగనన్న ఉన్నారు అనే ధైర్యంతో చదువుకోని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటామంటున్నారు. జగనన్న అడుగులో అడుగేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Share this article :

0 comments: