చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌ సీపీ ప్రశ్నలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌ సీపీ ప్రశ్నలు

చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌ సీపీ ప్రశ్నలు

Written By news on Thursday, March 20, 2014 | 3/20/2014

చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌ సీపీ ప్రశ్నలు
హైదరాబాద్ : టీడీపీ అధినే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా పలు సూటి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనంటూ పదే పదే చెప్పుకొంటున్న చంద్రబాబును ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఆ ప్రశ్నలివీ..
  • తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు?
  • పదేళ్లు ప్రతిపక్ష నాయుకుడిగా ఎందుకు ఉండిపోవాల్సివచ్చింది?
  • మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు నిర్మించిన నగరం ఏది?
  • వైఎస్‌ కంటే మెరుగైన పాలన అందించామని ఏ ఒక్కరితోనైనా చెప్పించగలరా?
  • మీరు ఈ సవాల్‌ని స్వీకరించగలరా?
  • వైఎస్‌ విజయమ్మ మీపై దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తుకు మీరు సిద్ధమేనా?
  • మీ హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్మేశారు, ఎందుకు మూసేశారు?
  • హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ భూములను ఏ హక్కుతో ఐఎంజీకి కేటాయించారు?
  • మీరు సీఎం అయ్యేనాటికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో మూడోస్థానంలో ఉన్న ఏపీ మీరు దిగిపోయేనాటికి ఐదోస్థానానికి పడిపోయింది నిజం కాదా?
  • రాష్ట్ర రాజధానిలోని భూముల్ని మీ అనుయాయులకు పప్పుబెల్లాల్లా పంచింది వాస్తవం కాదా?
Share this article :

0 comments: