చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టలేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టలేదు?

చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టలేదు?

Written By news on Monday, March 17, 2014 | 3/17/2014

'చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టలేదు?'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సూటిగా ప్రశ్నలు సంధించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. పలు ఆరోపణలు ఉన్నా చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టలేదని ఆపార్టీ ప్రశ్నించింది. సీబీఐ, ఈడీ, ఆర్ వోసీ, ఎస్ ఫ్ ఐ, ఏసీబీ విచారణలను ఎలా తప్పించుకున్నారని, 1998 జనవరిలో నీవు చేసిన 100 ఘోరాలపై బీజేపీ ఛార్జ్ షీటు ప్రకటించలేదా, ఆ వెంటనే వాళ్ల కాళ్లు పట్టుకుని వారితో డీల్ కుదుర్చుకోలేదా అని వైఎస్ఆర్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. దోచుకున్నది సింగపూర్ లో దాచింది నిజం కాదా? 1999 ఎన్నికల మేనిఫెస్టోలో రోజు హైదరాబాద్ నుంచి సింగపూర్ కు విమానం నడిపేలా ఏర్పాటు చేశానని చంద్రబాబు రాసుకులేదా అని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో  తరలించిన డబ్బు, బంగారం ఎంత అని వాసిరెడ్డి పద్మ అడిగారు. కోలా కృష్ణమోహన్, దొంగనోట్ల రామకృష్ణ గౌడ్ స్టాంపులు కుంభకోణం కేసులో నిందితుడు తెల్గీ, హసన్ అలీలతో నీకున్న సంబంధ బాంధవ్యాలపై విచారణకు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

చంద్రబాబు, ఆయన కుటుంబ సబ్యలు 1994 నుంచి 2014 వరకూ చేసిన విదేశీ పర్యటనలతో పాటు బాలాయిపల్లి భూముల కొనుగోలుపై విచారణకు సిద్ధమేనా అని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. తండ్రి ఇచ్చిన పొలాన్ని అమ్మేసినట్లు ఆయనకే చూపించిన ఘనుడవని అన్నారు. తల్లి పేరును మనీ ల్యాండరింగ్ కోసం వాడుకోలేదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

Share this article :

0 comments: