చేసి చూపిస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేసి చూపిస్తా

చేసి చూపిస్తా

Written By news on Friday, March 28, 2014 | 3/28/2014

చేసి చూపిస్తా
ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తా  
విశాఖ జిల్లా తగరపువలస సభలో వైఎస్ జగన్ హామీ
 
 విభజన వల్ల ఇప్పటికే నీళ్లకు కష్టం అనుకుంటే హైదరాబాద్‌ను కూడా మన నుంచి తీసేసుకున్నారు. నేను అధికారంలోకి వచ్చాక పదేళ్లలో సింగపూర్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మిస్తా. అంతేకాదు.. చదువుకున్న ప్రతి పిల్లాడికి ఓ ధీమా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబులా నేను సాధ్యంకాని హామీలు ఇవ్వను. మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అబద్ధాలు చెప్పను. గత నాలుగున్నరేళ్లుగా నన్ను చూశారు. ఎండనక, వాననక కష్టపడ్డ నన్ను చూశారు. మీ కష్టాలు చూసిన వాడిగా చెబుతున్నా.. ప్రతి పేద పిల్లాడికి నేను భరోసా ఇస్తున్నా. మీకు కష్టాలు లేకుండా చేస్తాను. ఏదేదో చెప్పి ఏదేదో మాట్లాడడం కాదు. చేసి చూపిస్తా. అందుకు మీ అందరి దీవెనలు కావాలి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి.    - వైఎస్ జగన్
 
 సాక్షి, తగరపువలస: ‘‘నాయకుడనేవాడు ప్రజలకు దశ, దిశ చూపించాలి. దురదృష్టవశాత్తూ అది జరగడంలేదు. కానీ నేనొచ్చి ఈ వ్యవస్థలో మార్పు తెస్తా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపై ప్రజల తలరాతలు, రాష్ట్ర చరిత్రను మార్చివేసే ఐదు సంతకాలు చేస్తా. వీటితోపాటు మరో మాట కూడ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికీ ఇల్లు లేదనే బెంగ లేకుండా చేస్తా.
 
 దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే, దివంగత నేత రాజశేఖరరెడ్డి అదే ఐదేళ్లలో ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఇవాళ వైఎస్ చనిపోయాక అస్తవ్యస్త పరిపాలన నడుస్తోంది. పేదలు ఇళ్లు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను చెబుతున్నా. ఇళ్లులేని ప్రతివారికీ హామీ ఇచ్చి చెబుతున్నా. 2019 నాటికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తా. ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్లి ఇళ్లు లేని వాళ్లు చేతులెత్తండి అని అడిగితే ఒక్కరు కూడా చేతులెత్తని స్థాయిలో పాలన చేస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్‌మోహన్‌రెడ్డి.. గురువారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపువలసలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అబద్ధాల కోరు చంద్రబాబు దొంగహామీలిచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారిని జైల్లో పెట్టాలని అన్నారు. సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 అలాంటి వ్యక్తినే ఎన్నుకోండి..
 
 ‘‘ఇవాళ మరో 40 రోజుల్లో రాష్ట్రమంతటా వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజల తల రాతలు మార్చబోయే ఈ ఎన్నికల్లో మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అని ఆలోచించాలి. ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి అని ప్రశ్నించుకోవాలి.
 
 ఏ వ్యక్తి ప్రజల గుండె చప్పుడు వింటారో, ఏ వ్యక్తి అయితే ప్రజల మనసు ఎరుగుతారో, ఏ వ్యక్తి చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో ఉండడానికి ఆరాటపడతారో అటువంటి నాయకుడిని సీఎంగా ఎంచుకోవాలి. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేయబోయే ఐదు సంతకాల్లో.. మొదటిది అక్కాచెల్లెళ ్ల కోసం చేస్తా. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో ఒక్కో పిల్లాడికి నెలకు రూ.500 చొప్పున, ఇద్దరైతే రూ.1,000 చొప్పున వేస్తాం. రెండో సంతకం అవ్వా, తాతల పింఛన్‌ను రూ.200 నుంచి రూ.700కు పెంచడానికి పెడతా. మూడో సంతకం రైతన్నలకు గిట్టుబాటు ధర అందించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడానికి పెడతా. నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసం పెడతా. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తా. 24 గంటల్లో కోరుకున్న కార్డును అదే గ్రామం, అదే వార్డులోనే అందించేందుకు ఐదో సంతకం పెడతా. గ్రామాల్లో బెల్ట్‌షాపులను రద్దుచేసి నియోజకవర్గానికి ఒకే మద్యం దుకాణం ఉండేలా చేస్తా. అక్కడ కూడా మద్యం ముట్టుకుంటే ధర షాక్ కొట్టేలా చేస్తా.
 
 చంద్రబాబును జైల్లో పెట్టాలి..
 
 ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాను అధికారంలో ఉండగా ప్రజలను నిలువునా వంచించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను గాలికొదిలేశారు. ఇప్పుడు ఏదోలా అధికారంలోకి రావడానికి తోచిన హామీలన్నీ ఇచ్చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా అంటున్నారు. నేనొక్కటే అడుగుతున్నా. ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్న మీరు మరి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అందుకే నోటికి వచ్చిన హామీలన్నీ గుప్పిస్తున్నారు. ఆల్‌ఫ్రీ అంటున్నారు. ప్రజలను మోసం చేయడానికి ఇటువంటి దొంగ హామీలిచ్చే చంద్రబాబును జైల్లో పెట్టాలి. కోట్లమంది ప్రజల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఒకే ఒక్కరికి వస్తుంది. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని వైఎస్ దేశానికి చూపించారు. నేను బాబులా ప్రజలకు సాధ్యం కాని హామీలివ్వను. చేసింది చెబుతా. చెప్పిందే చేస్తా.’’
 
 తరలివచ్చిన అభిమాన జనసందోహం
 విశాఖ జిల్లాలో మూడోరోజు సాగిన జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో జనాభిమానం పొంగి పొర్లింది. గురువారం ఉదయం పాయకరావుపేట నుంచి ప్రారంభమైన రోడ్ షోకు అడుగడుగునా జనం హోరెత్తారు. తగరపువలసలో సభకు జనం భారీగా హాజరవడంతో పక్కనే ఉన్న జాతీయ రహదారి సైతం కిక్కిరిసింది. ఒంగోలు టీడీపీకి చెందిన ఆర్‌కే టౌన్‌షిప్ అధినేత ఎం.కొండయ్య, కాంగ్రెస్ పార్టీ భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, పీసీసీ మాజీ సంయుక్త కార్యదర్శి వారణాసి దినేశ్‌రాజు గురువారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
 
Share this article :

0 comments: