వైఎస్ మరణంతో ‘ఏలేరు’కు గ్రహణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణంతో ‘ఏలేరు’కు గ్రహణం

వైఎస్ మరణంతో ‘ఏలేరు’కు గ్రహణం

Written By news on Monday, March 24, 2014 | 3/24/2014

వైఎస్ మరణంతో   ‘ఏలేరు’కు గ్రహణం
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే ఏలేరు ఆధునికీకరణ అటకెక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో ఆదివారం జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ ఏలేరు ఆధునికీకరణకు రూ.152 కోట్లు కేటాయించారన్నారు.
ఆయన మరణం తర్వాత ఆధునికీకరణను పట్టించుకోని ఫలితంగా ఆయకట్టు పరిధిలో సుమారు 50 వేల ఎకరాలు, ఎన్నో గ్రామాలు ముంపుబారిన పడుతున్నాయన్నారు. తమ పార్టీ ఏలేరు, సుద్దగెడ్డ ప్రాజెక్టుల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు.
గొల్లప్రోలు ముంపుకు బెడదను విరగడ చేస్తామన్నారు. ఇటీవల ప్రభుత్వం దిగిపోతున్న తరుణంలో ప్రజల కంటి తుడుపుగా నామమాత్రంగా పనులు ప్రారంభించిందన్నారు.
 
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, నాయకులు పంపన రామకృష్ణ, వేగిశెట్టి సత్తిరాజు, సుధీర్‌రాజు, జ్యోతుల భీముడు, మొగలి అయ్యారావు, బస్సా ప్రసాద్, దాసం లోవబాబు, రావు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

 పిఠాపురం అభ్యర్థిగా దొరబాబు

 పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా  పెండెం దొరబాబును జగన్ జనభేరి సభలో ప్రకటించారు. పార్లమెంటు అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ను ప్రజలకు పరిచయం  చేశారు.
 
గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా తెడ్లపు చిన్నారావును ప్రకటించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
Share this article :

0 comments: