టీడీపీకి ఎదురు దెబ్బ..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి ఎదురు దెబ్బ..!

టీడీపీకి ఎదురు దెబ్బ..!

Written By news on Wednesday, March 19, 2014 | 3/19/2014

టీడీపీకి ఎదురు దెబ్బ..!
గోస్పాడు, న్యూస్‌లైన్: నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. జిల్లెల్ల, దీబగుంట్ల గ్రామాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు మంగళవారం భూమా నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. జిల్లెల్ల గ్రామంలో టీడీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి అసంతృప్తితో ఉన్నారని మంతనాలు జరపాలని ఆ పార్టీ నేతలు శిల్పా మోహన్ రెడ్డి, ఫరూక్‌లు భావించారు.
 
 ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరరెడ్డి కుటుంబీకులు.. స్వయంగా భూమాను ఆహ్వానించి ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ ఉమామహేశ్వరమ్మ ఆమె భర్త గొటికె ఈశ్వరరెడ్డి, సదాశివారెడ్డి, లక్ష్మిరెడ్డి, రామేశ్వరరెడ్డి, సుబ్బరాయురావు, నాగిరెడ్డితో పాటు 300మంది టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు.
 
బలమైన వర్గంగా భావిస్తున్న గొటికె ఈశ్వరరెడ్డి చేరడంతో గ్రామంలోని రెండు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అవలీలగా విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన భూమానాగిరెడ్డి..తమ గ్రామంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో పార్టీలో చేరామని వారు వివరించారు.
 
 దీబగుంట్లలో..:  టీడీపీకి ఏకపక్ష గ్రామంగా కొనసాగుతున్న దీబగుంట్లలో సైతం వలసలు మొదలయ్యాయి. బలమైన నాయకులుగా పేరున్న ఇసుకపల్లె వీరారెడ్డి, మహేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, వర్దన్‌రెడ్డితో పాటు మరో వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. ఈ గ్రామం మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి కనుసన్నల్లో ఉంది. ఆయనను కాదని ఎవరూ ముందుకు రారులే అని శిల్పా మోహన్‌రెడ్డి కూడా ధీమాగా ఉన్నారు.
 
అయితే ఆయన మాటను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈశ్వరరెడ్డి కుటుంబీకులు భూమా సమక్షంలో చేరారు. పార్టీలోచేరిన వారిలో షేక్‌బాషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్‌రెడ్డి, ఓబులేసు, కాండ్లపల్లె రాంభూపాల్‌రెడ్డి, జింకల శంకరయ్య, బంట్రూతు ఆంజనేయులు, కాకనూరు రామిరెడ్డి ఉన్నారు.
 
 నియంతృత్వానికి చెల్లుచీటీ: ఇంతవరకు దీబగుంట్ల గ్రామంలో ప్రజలు అజ్ఞాతంలో ఉండేవారని భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ఇసుకపల్లి కుటుంబం మంచి నిర్ణయం తీసుకుందన్నారు.  రాజకీయ మనుగడ కోసం, ఆధిపత్యం కోసమే ప్రజలను ఇన్ని రోజులు మభ్యపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇసుకపల్లె ఈశ్వరరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా తాము అండగా ఉంటామని చెప్పారు.
Share this article :

0 comments: