నేడు వైఎస్సార్ జనభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్ జనభేరి

నేడు వైఎస్సార్ జనభేరి

Written By news on Monday, March 3, 2014 | 3/03/2014

నేడు వైఎస్సార్ జనభేరి

 చరిత్ర సృష్టించిన ఓదార్పు యాత్రకు మూడేళ్ల క్రితం ఏలూరు నగరంలో శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇక్కడి నుంచే పూరించనున్నారు.
జనభేరి మొదటి సభను శనివారం తిరుపతిలో నిర్వహించగా, రెండో సభను సోమవారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. 4వ తేదీన నిడదవోలులో నిర్వహించే జనభేరి బహిరంగ సభలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. అదేరోజు గోపాలపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. రెండు రోజులపాటు జిల్లాలో జరిగే జననేత జగన్ పర్యటనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విసృ్తత   ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 ముస్తాబైన ఏఎస్సార్ స్టేడియం
 జనభేరి నిర్వహించేందుకు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ వేదికను నిర్మించడంతోపాటు మహిళలు కూర్చునేందుకు ముం దు భాగాన కుర్చీలు వేశారు. సభకు కనీసం లక్ష మంది హాజరు కానుండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నేతలు నాలుగు రోజుల నుంచి ఈ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సభను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు.
పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రశేఖర్ ఏడు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సభా ప్రాంగణ ఏర్పాట్లను ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆళ్ల నాని పార్టీ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు తదితర నేతలతో కలసి స్టేడియంను పరిశీలించారు. జనభేరి నేపథ్యంలో స్టేడియం పరిసరాలతోపాటు నగరం మొత్తం వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలతో నిండిపోయింది.
మరోవైపు ఈనెల 4వ తేదీన నిడదవోలు జనభేరి, గోపాలపురంలో రోడ్ షోకు సంబంధించి అక్కడి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, నిడదవోలు, గోపాలపురం సమన్వయకర్తలు ఎస్.రాజీవ్‌కృష్ణ, తలారి వెంకట్రావు విస్తృత ఏర్పాట్లు చేయిస్తున్నారు.
 
ఓదార్పు నుంచి జనభేరి వరకూ..
 దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్రకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులోనే శ్రీకారం చుట్టారు. 2010 ఏప్రిల్‌లో జిల్లాలో నాలుగు రోజులపాటు పగలూ రాత్రి యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు కనీవినీ ఎరుగని స్పందన లభించింది. గ్రామాల్లో జనం అర్ధరాత్రి వేళ కూడా కూడా జగన్ కోసం వేచి ఉండి మరీ అప్పట్లో ఓదార్పుయాత్రను చేశారు. ఆ తర్వాత 2011 ఫిబ్రవరిలో పోలవరం ప్రాజెక్టు సాధన కోసం అమలాపురం నుంచి పోలవరం వరకూ హరితయాత్ర పేరుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్రకూ జనం నీరాజనాలు పలికారు. 2012లో పోలవరం, నరసాపురం ఉప ఎన్నికల సమయంలో రెండు విడతలుగా ఆయన ఆ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ తర్వాత గత ఏడాది నవంబర్‌లో తుపానుకు దెబ్బతిన్న నరసాపురం, పాలకొల్లు ప్రాంతా ల్లో పర్యటించి రైతులను పరామర్శిం చారు. జననేత ప్రతి పర్యటనకూ జిల్లా ప్రజలు నీరాజనాలు పలికారు. తాజాగా వైఎస్ జగన్ చేపట్టిన రెండు జనభేరి సభలను అదే రీతిలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
Share this article :

0 comments: