రుణమాఫీ చేయాలని కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాశారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రుణమాఫీ చేయాలని కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాశారా?

రుణమాఫీ చేయాలని కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాశారా?

Written By news on Sunday, March 16, 2014 | 3/16/2014

'రుణమాఫీ చేయాలని కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాశారా?'
కదిరి: మహనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావాలకు వారసత్వంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. వెనకబడ్డ వారి అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని స్ఫష్టం చేశారు. పేద ప్రజల సంతోషం కోసం వైఎస్‌ఆర్‌ నిరంతరం తపించేవారని విజయమ్మ అన్నారు. 
 
ప్రేద ప్రజల కోసం వైఎస్ఆర్ పడే తపన, ప్రేమ, అభిమానం జగన్‌బాబులో చూస్తున్నానని ఆమె తెలిపారు.  వైఎస్‌ఆర్‌ కలలను, ఆశయాలను జగన్‌ బాబు పూర్తిచేస్తారని,  
అందుకే జగన్‌ బాబును ప్రజల చేతుల్లో పెట్టానని వైఎస్‌ విజయమ్మ చెప్పారు. వైఎస్ఆర్ సువర్ణ యుగాన్ని తీసుకురావడానికి ప్రతి అభ్యర్థిని మీ చేతుల్లో పెడుతున్నానని విజయమ్మ అన్నారు. 
 
జగన్‌ బాబును మనం అధికారంలోకి తెచ్చి వైఎస్‌ఆర్‌ స్వర్ణయుగానికి సాధిస్తామని విజయమ్మ అన్నారు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో చంద్రబాబు చీకటి యుగాన్ని, వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని చూశామని..  వైఎస్‌ఆర్‌ తర్వాత పాలననూ మనం చూశామన్నారు. 
 
రైతు పక్షపాతిగా వైఎస్‌ఆర్‌ మొదటి సంతకాన్ని చేశారని, ఆతర్వాత కరెంటు బకాయిలను రద్దు, రుణాలను రీషెడ్యూల్‌ చేశారన్నారు.  300శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీని వైఎస్‌ఆర్‌ ఇచ్చారని, రోడ్డు ప్రమాదం జరిగినా, పొలంలో పురుగోపుట్రో కాటేసినా ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేదని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యం కోసం పుస్తెలు, పొలాలు అమ్ముకున్న సందర్భాలు చూశామని, అందరికీ ఆరోగ్యం అందాలనే వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పెట్టారన్నారు.  అందుకే ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజల హృదయాల్లో వైఎస్‌ఆర్‌ను చూస్తున్నాని వైఎస్‌ విజయమ్మ తెలిపారు. 
 
ప్రజలు తాగునీరు లేక అల్లాడుతుంటే, చంద్రబాబు ఇంకుడు గుంతలు తవ్వుకోమన్నారని,  ఏ వాగ్దానాల మీద టీడీపీ అధికారంలోకి వచ్చిందో వాటిని చంద్రబాబు తుంగలో తొక్కారని వైఎస్‌ విజయమ్మ విమర్శించారు.  ఒక్క హామీని అమల్లోకి తెచ్చిన పాపానపోలేదని,  చంద్రబాబు 9 ఏళ్లలో రుణమాఫీ గురించి ఎందుకు ఆలోచించలేక పోయారని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.  రుణమాఫీ చేయాలంటూ కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా అని కదిరిలో వైఎస్‌ విజయమ్మ నిలదీశారు. 
 
Share this article :

0 comments: