పోలీసుల వేధింపులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీసుల వేధింపులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

పోలీసుల వేధింపులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురిచేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్‌లు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంతరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం సీఐ భాస్కర్‌రెడ్డి కౌన్సెలింగ్ పేరిట వైఎస్సార్‌సీపీకి చెందిన 150 మంది మద్దతుదారులను వేధించడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
 
  ఎలాంటి కారణం లేకుండా సీఐ ప్రవర్తించిన తీరుతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని వివరించారు. సీఐ వ్యవహరించిన తీరు వల్ల ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే, ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి ఇలాంటి చర్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు లక్ష్యంగా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వివరించారు. ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనకుండా భయాందోళనలు సృష్టించేవిధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, వీటిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.
 
 కాపు కుటుంబానికి జగన్ పరామర్శ
 వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురిచేయడంపై కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబీకులను పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జనభేరి పర్యటనలో ఉన్న జగన్  కాపు ఆత్మహత్యాయత్నం ఉదంతం తెలుసుకుని ఆవేదన చెందారు. కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుల దమన నీతిని ఖండించిన జగన్... రామచంద్రారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Share this article :

0 comments: