కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు

కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014

కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు
ఎమ్మెల్యేను పరామర్శించిన షర్మిల, బ్రదర్ అనిల్
వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శ
 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుట పడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాయదుర్గం పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం ముందు బళ్లారికి, అక్కడనుంచి బెంగళూరుకు తరలించిన విషయం విధితమే.

రామచంద్రారెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రి వైద్యులు బుధవారం తెలి పారు. వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఎమ్మెల్యే కాపును ఫోన్‌లో పరామర్శించారు. కాపును జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన భర్త ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ఎమ్మెల్యే సతీమణి భారతి తెలిపారు. 
 
పోలీసుల వలయంలో రాయదుర్గం
రాయదుర్గం: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యకు యత్నించిన నేపథ్యం లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాయదుర్గం పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఆర్మీ, ప్రత్యేక దళాలు బందోబస్తు నిర్వహించాయి. పట్టణం పోలీసుల వలయంగా మారడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరూ పట్టణంలోకి రాకుండా పల్లెల్లో హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యాలయం ముందు ఒక ఎస్‌ఐతో పాటు ప్రత్యేక దళాలు మోహరించాయి.

ప్రధాన కూడళ్లలో పోలీ సులు, ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రజలు పనులు చేసుకునేందుకు సైతం భయపడ్డారు. కౌన్సిలింగ్ పేరుతో సంఘ విద్రోహక శక్తులపై చర్యలు తీసుకోవాలని, కానీ సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్న నాయకులను కొట్టడం అప్రజాస్వామికమని ప్రజలు చర్చించుకున్నారు. శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి కోరినా డీఎస్పీ తిరస్కరించినట్లు వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి  కార్యకర్తలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. 
Share this article :

0 comments: