అత్యధిక మునిసిపాలిటీలు వైఎస్ ఆర్ సీపీవే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అత్యధిక మునిసిపాలిటీలు వైఎస్ ఆర్ సీపీవే

అత్యధిక మునిసిపాలిటీలు వైఎస్ ఆర్ సీపీవే

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

అత్యధిక మునిసిపాలిటీలు వైఎస్ ఆర్ సీపీవే
హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వాయిదా వేయాలని తమ పార్టీ కోరడంలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయలేదని చెప్పారు. తమ పార్టీ తరపున వాయిదా వేయమని ఏ ఒక్కరికి విజ్ఞప్తి చేయలేదని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కొణతాల విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వేధిస్తున్నారని చెప్పారు. వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎలాంటి నేరచరిత్ర లేని పార్టీ వ్యక్తుల్ని పోలీసులు బైండోవర్‌ల పేరుతో అరెస్ట్ చేశారని కొణతాల తెలిపారు. త్వరలో వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తోందని చెప్పారు
Share this article :

0 comments: