తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

Written By news on Friday, March 28, 2014 | 3/28/2014

'రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చారు'
కడప: ప్రొద్దుటూరు తాగునీటి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ జాప్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం అయితే ప్రొద్దుటూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆమె హామీయిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రోడ్ షోలో విజయమ్మ ప్రసంగించారు.

పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వైఎస్ఆర్ ఎంతో ఆరాట పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చారా, రుణమాఫీ చేశారా, ప్రాజెక్ట్‌లు కట్టారా అని విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23,500 ఉద్యోగాలు తొలగించారని వెల్లడించారు. 7 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని దుయ్యబట్టారు.

గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రాన్ని విభజన జరిగేది కాదన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమన్నారు. వైఎస్ జగన్ ప్రాబల్యం తగ్గించేందుకే విభజన చేశారన్నారు. విభజన ఎలా చేయాలో కిరణ్‌ రోడ్డు మ్యాప్ ఇచ్చారని ఆరోపించారు. ఉద్యోగుల సమ్మెను కిరణ్ నీరుగార్చారని వైఎస్ విజయమ్మ అన్నారు.
Share this article :

0 comments: