చంద్రబాబు పాలన భయానకం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పాలన భయానకం: వైఎస్ జగన్

చంద్రబాబు పాలన భయానకం: వైఎస్ జగన్

Written By news on Sunday, March 23, 2014 | 3/23/2014

గొల్లప్రోలు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత తొమ్మిదేళ్ల పాలన భయానకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ జనపథంలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. అధికారం కోసం చంద్రబాబులా తాను మోసపూరిత హామీలివ్వనని స్పష్టం చేశారు.  మామను వెన్నుపోటు పొడిచినట్లుగానే చంద్రబాబు అధికారం కోసం ప్రజలను వెన్నుపోటుపొడుస్తారని చెప్పారు.
 
2019 కల్లా విద్యుత్‌ కోతల్లేని రాష్ట్రంగా మారుస్తానని వైఎస్ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతిజిల్లాలోనూ ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి, అందులో వైద్యులు అందుబాటులో ఉండేటట్లు కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా తీర్చిదిద్దుతానని చెప్పారు. చంద్రబాబులా ఇంటికో ఉద్యోగం కాదు కానీ, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా కృషిచేస్తా వైఎస్ జగన్‌ హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రజల సంక్షేమం కోసం ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. వైఎస్ఆర్ అమ్మ ఒడి పథకం, రూ.200 నుంచి 700కు పెంచే వృద్ధుల పింఛన్‌ పథకం, రైతుల కోసం ధరల స్థీరకరణ ఫండ్ రూ.3వేల కోట్ల పథకం, డ్వాక్రా రుణాల రద్దు, పల్లె పాలన పథకంపై సంతకాలు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: