గుడిసెలు లేని రాజ్యం జగనన్నకే సాధ్యం: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుడిసెలు లేని రాజ్యం జగనన్నకే సాధ్యం: షర్మిల

గుడిసెలు లేని రాజ్యం జగనన్నకే సాధ్యం: షర్మిల

Written By news on Wednesday, March 26, 2014 | 3/26/2014

సాక్షి  ప్రతినిధి, విజయవాడ/ గుంటూరు: ‘‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గుడిసెలనేవే లేకుండా ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్ళు ఉండే బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు... రాబోయే రాజన్న రాజ్యంలో రైతన్న నష్టపోకుండా రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాడు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తాడు... డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాడు... అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ తన బిడ్డలను చదివించుకోవడానికి రూ. 500లు నుంచి రూ. వెయ్యి నేరుగా అమ్మ అకౌంట్‌లో పడుతుంది... వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛను పెంచుతాడు... ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటి పథకాలన్నీ అమలు చేస్తాడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రకటించారు.
 
 అందుకే మహానేత రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకుని ఫ్యాను గుర్తుమీద అమూల్యమైన ఓటు వేసి జగనన్న నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సహకరించిన చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే ఏ ముఖం పెట్టుకొని వచ్చావని ఆయన్ను తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆమె మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరుజిల్లా మంగళగిరి, తాడేపల్లిలో బహిరంగసభల్లో ప్రసంగించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీల్లో రోడ్‌షోలలో ప్రసంగించారు.
Share this article :

0 comments: