వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఘన విజయం ఖాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఘన విజయం ఖాయం

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఘన విజయం ఖాయం

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

'వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఘన విజయం ఖాయం'
హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీ ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. స్థానికసంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై పనిచేశాయి అని ఆరోపించారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే వైఎస్ఆర్ సీపీ విజయబావుట ఎగురవేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. అక్రమాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. డబ్బు, మద్యం పంపకాల్లో కాంగ్రెస్, టీడీపీలు రికార్డు సృష్టించాయని ఆమె విమర్శించారు. 
 
ప్రజలు వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టడానికి ఏకపక్షంగా సిద్ధ పడ్డారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. 
Share this article :

0 comments: