ముస్తాబైన ‘పెవిలియన్’.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముస్తాబైన ‘పెవిలియన్’..

ముస్తాబైన ‘పెవిలియన్’..

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

నమస్తే అన్నయ్యా... నమస్తే అక్కా... నమస్తే చెల్లెమ్మా... నమస్తే తాతా అంటూ ప్రజానీకాన్ని ఆప్యాయతతో పలుకరించి అక్కున చేర్చుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఖమ్మం జిల్లా ఎదురుచూస్తోంది.

బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా, తండ్రి చూపిన బాటలో అహర్నిశలు  పేద ప్రజల కోసం శ్రమిస్తున్న జగన్ బుధవారం ఖమ్మంలో నిర్వహించే ‘జనభేరి’ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా... తెలంగాణలో తొలిసారి ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సభకు భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ స్థానిక  నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలతో ఖమ్మం కళకళలాడుతోంది.

 ముస్తాబైన ‘పెవిలియన్’..
 జనభేరి సభ జరగనున్న పెవిలియన్ గ్రౌండ్ వైఎస్సార్‌సీపీ తోరణాలు, జగన్ ఫ్లెక్సీలతో ముస్తాబైంది. జగన్ ప్రసంగించనున్న ప్రధాన వేదికను మహానేత వైఎస్‌ఆర్, జగన్ చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలతో తీర్చిదిద్దారు. కాల్వొడ్డు, మయూరి సెంటర్, బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, శ్రీశ్రీ సెంటర్‌లో దారిపొడవునా జగన్‌కు స్వాగతం పలికేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

 మైదానంలోకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సూచనలు ఇచ్చేందుకు వెయ్యిమందికి పైగా వలంటీర్లను నియమించారు. సభకు హాజరయ్యే వారికి కోసం మంచినీరు తదితర ఏర్పాట్లను చేశారు. పట్టణమంతా జగన్ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. సభ ఏర్పాట్లను పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు.  జిల్లా సరిహద్దున ఉన్న నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పలు మండలాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తారని.. జగన్ పర్యటనకు అనూహ్య స్పందన రానుందని నేతలంటున్నారు.

 పల్లెపల్లెకూ జనభేరి నినాదం...
 తెలంగాణలో ఇదే తొలి ఎన్నికల ప్రచార సభ కావడంతో పార్టీ నేతలు సర్వశక్తులొడ్డారు. జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. సభను విజయవంతం చేసేందుకు వివిధ రూపాల్లో ప్రతి పల్లెకు జనభేరి నినాదం వెళ్లింది. కరపత్రాలు, పోస్టర్లు, ఆటోమైక్‌లతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.   పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి నుంచి జగన్ బయలుదేరి సత్తుపల్లి మండలం గంగారం, సత్తుపల్లి, వైరా మీదుగా ఖమ్మం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జగ న్ పర్యటన సాగే ప్రాంతాలలో కూడా ఇప్పటికే మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి, జగన్ చిత్రాలతో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రతి గ్రామంలో  జగన్‌కు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

 కాగా, జనభేరి సభకు ముందస్తుగా మంగళవారం ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో పాటు వందలాది మంది పాల్గొని సభను విజయవంతం చేయాలని నినాదాలిచ్చారు. అలాగే ఇల్లెందులో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు పాల్గొన్నారు. కాగా, సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎ.వి.రంగనాథ్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Share this article :

0 comments: