పుట్టగొడుగుల్లా ఎన్ని వచ్చిన వైఎస్ఆర్ సీపీకే ప్రజల ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పుట్టగొడుగుల్లా ఎన్ని వచ్చిన వైఎస్ఆర్ సీపీకే ప్రజల ఆదరణ

పుట్టగొడుగుల్లా ఎన్ని వచ్చిన వైఎస్ఆర్ సీపీకే ప్రజల ఆదరణ

Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014

రాష్ట్రంలో రోజుకో పార్టీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. ఆ పార్టీ నాయకులు కోనేరు ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.గౌతం రెడ్డి సమక్షంలో గురువారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెయ్యి మందికిపైగా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నామని అయితే ఎంత కాలం ఆ పార్టీలోనే ఉంటామో తెలియడం లేదని  ఆ పార్టీలోకి వెళ్తున్న నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారని వారు వెల్లడించారు. ప్రజలకు ఏం చేస్తామో తమ పార్టీ స్పష్టంగా చెబుతుందన్నారు. అంతేకాని ఏ పార్టీని విమర్శించే అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని కోనేరు ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.గౌతం రెడ్డి స్పష్టం చేశారు.

Share this article :

0 comments: