ఖమ్మంలో జగన్‌ షో ‘అదుర్స్‌’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మంలో జగన్‌ షో ‘అదుర్స్‌’

ఖమ్మంలో జగన్‌ షో ‘అదుర్స్‌’

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

‘తెలంగాణలో వైఎస్సార్సీపీకి చోటు లేదు..’ అంటూ చాలామంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంటే, వాటిని లెక్క చేయకుండా వైఎస్‌ జగన్‌, తెలంగాణలోకి అడుగు పెట్టారు. భారీయెత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు జగన్‌కి బ్రహ్మరథం పట్టారు. జగన్‌ రాకను నిరసిస్తూ, ఖమ్మంలో ‘బంద్‌’కి కూడా పిలుపునిచ్చారు కొందరు. అయినాసరే.. జగన్‌ షరామామూలుగానే జనసంద్రాన్ని సృష్టించగలిగారు.
ఏదో మామూలుగా ఖమ్మంలో అడుగుపెట్టి, చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోలేదు వైఎస్‌ జగన్‌. భారీ కాన్వాయ్‌తో తెలంగాణలోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌, ఖమ్మం ప్రజానీకం ఆశీర్వాదం అందుకున్నారు. తనకు ఆహ్వానం పలికినవారితో ముచ్చటించారు, ‘అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, తాత, అవ్వ..’ అంటూ సంబోదిస్తూ ముందుకు కదిలారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ దుర్మార్గంగా వ్యవహరించిందనీ, ఓట్ల కోసమే రాష్ట్రాన్ని విడదీసిందనీ, కుట్రపూరితంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించగలిగిందే తప్ప, ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు జాతిగా తామొక్కటేనన్న తెలుగు జాతి ఐక్యతను చీల్చలేకపోయిందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.
వేల సంఖ్యలో జగన్‌ వెంట ఖమ్మంలో కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజానీకం అడుగులేశారు. బహిరంగ సభ జరిగిన వేదిక అయితే జనసందోహంగా మారిపోయింది. ఇదంతా చూశాక, ‘రాష్ట్ర విభజనకు ముందే జగన్‌ తెలంగాణలో పర్యటించి వుండాల్సింది..’ అనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మంలో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తే మానుకోట ఘటన పునరావృతమవుతుందనే సోకాల్డ్‌ తెలంగాణ హెచ్చరికలేవీ ఇక్కడ పనిచేయలేదనే చెప్పాలి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం.. మాది సమైక్య నినాదం.. అని గత కొన్నాళ్ళుగా చెబుతున్న వైఎస్‌ జగన్‌, విచిత్రంగా తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికల నగారా మోగించడం గమనార్హం. సీమాంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లో రాజన్నరాజ్యం వచ్చి తీరుతుందని జగన్‌ ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో ధీమా వ్యక్తం చేశారు.

 http://telugu.greatandhra.com/politics/gossip/khammam-lo-jagan-show-adurs-50898.html#sthash.XiGPQPLu.dpuf
Share this article :

0 comments: