జయహో జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జయహో జగన్

జయహో జగన్

Written By news on Monday, March 31, 2014 | 3/31/2014

జయహో జగన్
జయజయధ్వానాలు మిన్నంటుతున్నాయి...ఎక్కడికి వెళ్లినా, ఎవరిని పలకరించినా ఆ ధ్వానాలే ప్రతిధ్వనిస్తున్నాయి....పల్లె,పట్నం అన్న తారతమ్యం లేదు. నిరక్షరాస్యులు, విద్యార్థులు అన్న భేదం లేదు. స్త్రీ,పురుషులు అన్న తేడా అంతకన్నా లేదు. దేవుని గుడిలో హారతిలాంటి  ఏ పాపమూ ఎరుగని ముత్యాల్లాంటి చిన్నారులు సైతం జయహో జగన్ అని నినదిస్తున్నారు. తమ ఆకాంక్షలు ఈ  జయనామ సంవత్సరంలో మీ విజయానికి చిరునామా కావాలని ఆశిస్తున్నారు.
 
ఆ అభిమాన జడిలో తడుస్తూ... పేరుపేరునా పలకరిస్తూ... సమస్యలను  అడిగి తెలుసుకుంటూ... చెంపలపై జారుతున్న కన్నీటిని ఆప్యాయంగా తుడుస్తూ  భావోద్వేగాల నడుమ వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి  జనభేరి యాత్ర జిల్లాలో సాగుతోంది. ప్రజలతో జగన్‌మోహన్ రెడ్డి మమేకమవుతున్న తీరు జిల్లా వాసులకు భవిష్యత్‌పై నమ్మకం పెరిగేలా చేస్తోంది. కష్టాలను అడిగి తెలుసుకుంటూ ‘నేనున్నాను..’ అంటూ ఆయన భరోసా ఇస్తున్న విధానం ఇన్నాళ్లకు సరైన నాయకుడు వచ్చాడన్న ఆనందం కలిగిస్తోంది.
 
నిశీధిలో వెలుగు రేఖలా... వెన్నుపోటు నాయకుల మధ్యలో ఆశాకిరణంలా జనం కళ్లలో ఇంద్రధనుస్సులు పూయిస్తూ  జగన్‌మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారు. ఆదివారం ఆయన  చీపురుపల్లి నుంచి బయలుదేరి గరివిడి, గుర్ల, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల మీదుగా గజపతినగరం చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. 
Share this article :

0 comments: