అధికార పార్టీతో కలిసి పనిచేసిన ప్రతిపక్షం టీడీపీనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికార పార్టీతో కలిసి పనిచేసిన ప్రతిపక్షం టీడీపీనే

అధికార పార్టీతో కలిసి పనిచేసిన ప్రతిపక్షం టీడీపీనే

Written By news on Monday, March 17, 2014 | 3/17/2014

అధికార పార్టీతో కలిసి పనిచేసిన ప్రతిపక్షం టీడీపీనేవీడియోకి క్లిక్ చేయండి
అనంతపురం: అధికార పార్టీతో కలిసి పని చేసిన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది టీడీపీ అని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ప్రజలకు ఏం మేలుచేశారని చంద్రబాబు ప్రజల ముందుకు వెళుతున్నారని ఆమె ప్రశ్నించారు. బాబు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే.. కిరణ్ తన హయాంలో నాలుగు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన సంగతిని గుర్తు చేశారు. అనంతపురం ఎన్నికల రోడ్ షో ప్రసంగించిన విజయమ్మ .. సంక్షమే పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారని బాబు చెప్పాలేదా?అని ప్రశ్నించారు.  తెలుగువారిని రెండుగా విభజించడానికి కారణం చంద్రబాబు కాదా?అని నిలదీశారు.  కిరణ్ తన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ చేశారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేయమంటే రాజీ నామా చేయమంటే కిరణ్ ససేమిరా అంటూ ఆ కుర్చీలోనే కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
 
ఒకప్రక్క సీమాంధ్ర అంటూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు.చంద్రబాబు పరిపాలన చీకటి యుగమేనన్నారు. ఏ ఒక్క వాగ్ధాన్నేనా నెరవేర్చానని ఆయన చెప్పగలరా?అని ప్రశ్నించారు.  రూ.2 కిలో బియ్యాన్ని రూ.5.20 చేసిన ఘనత చంద్రబాబుదే దక్కుతుందని విమర్శించారు. రుణమాఫీ ఏవిధంగా అమలు చేస్తారో చంద్రబాబు చెప్పడం లేదని, ఇప్పుడేమో  అధికారం కోసం తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పూర్తయిన హంద్రీనీవా 85 శాతం పూర్తయిన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. రైతుల పొలాలకు నీరు అందిస్తారని విజయమ్మ స్పష్టం చేశారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: