రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న ఖమ్మం జిల్లా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న ఖమ్మం జిల్లా

రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న ఖమ్మం జిల్లా

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014

రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న ఖమ్మం జిల్లా
తెలంగాణలో తొలి ఎన్నికల శంఖారావం పూరించిన జగన్

 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజన్న తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా అక్కున చేర్చుకుంది. తెలంగాణలో రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన జరిపిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభ విజయవంతమైంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాలో మొత్తం 95 కిలోమీటర్ల మేర పర్యటించారు. జిల్లా శివార్లలోని సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామం నుంచి ఆయన రోడ్డు మార్గంలో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్లల మీదుగా ఖమ్మం చేరుకుని అక్కడ భారీబహిరంగ సభలో పాల్గొన్నారు. లక్షలాది మంది ఉవ్వెత్తున తరలివచ్చిన ఈ సభతో వైఎస్సార్ సీపీ తెలంగాణ జిల్లాల్లో తొలి ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టయింది.
 
 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయిన రోజే ఈ సభ నిర్వహించడంతో అన్ని రాజకీయ పక్షాల దృష్టి దీనిపైనే పడింది. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ఈ సభావేదికగా జగన్ ఏం చెపుతారా అని రాష్ట్ర రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలించాయి. ముఖ్యంగా జగన్‌ను రానీయకుండా అడ్డుకుంటామని కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ప్రకటించడంతో ఈ సభకు మరింత ప్రాధాన్యం పెరిగింది. అందరి అంచనాలకు భిన్నంగా ఖమ్మం జనభేరి వేదికగా జగన్ చేసిన ప్రసంగం రాష్ట్ర రాజకీయ వ్యవస్థను ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా తెలుగు జాతి, భాష ఒక్కటేనని, భూమిగా విడిపోయినా మనసులు విడ దీయలేరని, ఆపద వస్తే అందరం ఒక్కటవుతామని జగన్ చెప్పినప్పుడు సభికులు కేరింతలు కొట్టారు.
 
 
 ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశాన్ని సూటిగా ఆయన ప్రశ్నించిన తీరు సభికులను ఆకట్టుకుంది.ప్రతి పేదవాడి గుండెచప్పుడు కోసం వైఎస్సార్ పనిచేశారని, పేదల స్వప్నాన్ని నెరవేర్చేందుకు తానున్నానని నిరూపించారని జగన్ చెప్పినప్పుడు సభాప్రాంగణం దద్దరిల్లిపోయింది. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో జగన్ బుధవారం జరిపిన పర్యటన ప్రజల్లో వైఎస్‌కు ఉన్న విశ్వసనీయతకు, జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమనే భావన అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అవ్వ కాలికి చెప్పు తొడిగి..
 బుధవారం ఖమ్మం జిల్లా నూతనకల్ వద్ద జగన్‌ను చూడడానికి ఓ వృద్ధురాలు వచ్చింది. అయితే జనతాకిడిలో కాలిచెప్పులు ఊడిపోయి ఆమె ఇబ్బంది పడుతోంది. గమనించిన జగన్ కాన్వాయ్ నుంచి దిగివచ్చి స్వయంగా వృద్ధురాలి కాలికి చెప్పు తొడిగారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. జాగ్రత్తమ్మా.. అంటూ తల నిమిరారు. సాక్షాత్తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడే తనవద్దకు వచ్చి కాలిచెప్పులు తొడగడంతో ఆ వృద్ధురాలి కళ్లు చెమ్మగిల్లాయి.    
- న్యూస్‌లైన్, సత్తుపల్లి
Share this article :

0 comments: