వైఎస్ జగన్ గురించి మీకు తెలియని 5 విషయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ గురించి మీకు తెలియని 5 విషయాలు

వైఎస్ జగన్ గురించి మీకు తెలియని 5 విషయాలు

Written By news on Tuesday, April 22, 2014 | 4/22/2014

వైఎస్ జగన్ గురించి మీకు తెలియని 5 విషయాలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాల నుంచి బయటకు వచ్చి, నాన్న ఆశయాల సాధన కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన అలుపెరుగని పోరాట యోధుడు... మాట తప్పని, మడమ తిప్పని నైజం ఉన్నవాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేసి, తెలుగువారి ఆత్మఘోషను జాతీయ స్థాయికి సైతం తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ఇలా ఒక నాయకుడిగా వైఎస్ జగన్ గురించి అందరికీ తెలుసు. కానీ ఒక బాలుడిగా, ఒక తండ్రిగా ఆయన గురించి మీకు ఎంతవరకు తెలుసు?

1) జగన్ కు ఇష్టమైన సినిమా ఏంటి?

ఎప్పుడూ జనంలోనే ఉండి, జనం కోసమే పోరాడే వైఎస్ జగన్.. సినిమాలు చూస్తారంటే మీరు నమ్ముతారా? కానీ ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పిల్లలతో కలిసి సినిమాలు చూడటాన్ని ఇష్టపడతారు. అలాగే తన చిన్నతనంలో 'స్టార్ వార్స్' చిత్రాన్ని పదే పదే చూసేవారు. ఆ సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం.

2) జగన్ ఆటలు ఆడతారా?

చిన్నతనంలో ఆయనకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. తన స్నేహితులతో కలిసి ఆడేవారు కూడా.

3) జగన్ తన పిల్లలకు ఇచ్చిన బహుమతి ఏంటి?

బంధాలు, అనుబంధాలకు వైఎస్ జగన్ అత్యంత విలువనిస్తారు. తప్పుడు కేసులలో తనను జైలుపాలు చేసి, కుటుంబం నుంచి దూరం చేసినప్పుడు ఆయన తరచుగా  తన కుమార్తెలకు లేఖలు రాసి, వాటిని వాళ్ల పుట్టిన రోజు బహుమతిగా అందజేశారు.

4) జగన్ జీవన శైలి ఎలా ఉంటుంది?

ఆయన చాలా నిరాడంబర జీవితం గడుపుతారు. సాదాసీదా ఆహారాన్నే ఆయన ఇష్టపడతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన ఆహారం.. పప్పన్నం

5) జగన్ భక్తిపరుడా?

తన ప్రసంగాలలో వైఎస్ జగన్ పలుమార్లు దేవుడిని ప్రస్తావిస్తారు. ఆయనకు దైవభక్తి అపారం. సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్రంగా గాయపడినప్పుడు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి రోజూ 25-30 నిమిషాల పాటు దైవప్రార్థన చేస్తారు.
Share this article :

0 comments: