హిందూ ధర్మ రక్షణకు వైఎస్ కృషి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » హిందూ ధర్మ రక్షణకు వైఎస్ కృషి

హిందూ ధర్మ రక్షణకు వైఎస్ కృషి

Written By news on Friday, April 4, 2014 | 4/04/2014

వైఎస్ రాజశేఖరరెడ్డి హిందూ సమాజానికి ఎంతో మేలు చేశారు. ధార్మిక రక్షణ ప్రాముఖ్యతను గుర్తించారు. ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ ధర్మాదాయ చట్టానికి 2007లో సవరణలు తెచ్చారు. దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు. 25 వేల దేవాలయాలను పునరుద్ధరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేశారు. వైఎస్ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రోశయ్య, కిరణ్‌లు చట్టాన్ని అమలుచేయలేదు. చాలా దేవాలయాలు శిథిలాలుగా మారుతున్నాయి.


వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు.

చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా అర్చకులు వైఎస్సాఆర్‌ను ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా.

ఈ హామీతో వైఎస్సాఆర్‌కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు.

అర్చక వెల్ఫేర్ ఫండ్‌ని ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దానిద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు.

అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు.

విద్య గృహనిర్మాణానికి రుణాలు అందజేశారు.

గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు.

ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు

కామన్‌గుడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి దేవాలయాల పునరుద్ధరణకు శ్రీకారంచుట్టారు

వైఎస్ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసి అర్చకులకు వేతనాలు అందించాలని చెప్పారు.

3/2007 సెక్షన్-ఎ ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక బ్యాంకు ఏర్పాటు చేసి వేతనాలు అందించాలని చట్టాన్ని సవరించారు. అందరు ఎమ్మెల్యేలను ఒప్పించి మరీ ఈ చట్టాన్ని ఆమోదింపచేశారు.

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు సేవా టిక్కెట్లలో వాటా, హుండీల్లో వాటా ఉండాలని చెప్పారు.

దేవాలయాల్లోని ధర్మకర్తల మండలిలో అర్చకులకు స్థానం కల్పించారు.

గ్రామాల్లో వర్షాలు పడాలన్నా... రైతుల జీవితాలు బాగుపడాలన్నా గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు కొనసాగాలని, అలా ఉండాలంటే అర్చకుల జీవితాలు బాగుపడాలని వైఎస్ ఆకాంక్షించారు.

ఆ మేరకు ఐదు వేల దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కింద ప్రతి అర్చకునికి నెలకు రూ. 2,500 చొప్పున వేతనం అమలుచేశారు.

ప్రస్తుతం ఈ వేతనాన్ని ఐదు ఎకరాల భూమి ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు నిలిపివేశారు. దీంతో ఆయా కుటుంబాలన్నీ నానా ఇబ్బందులు పడుతున్నాయి.

దేవాలయ వ్యవస్థను కుప్పకూల్చిన చట్టం


దేవాలయాలకు సంబంధించి 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం చల్లా కొండయ్య కమిషన్ వేసింది.

దేవాలయాలు బ్రాహ్మణులు జీవించడం కోసం పెట్టుకున్నవేనని కమిషన్ నివేదికను ఎన్టీఆర్ నమ్మారు. ఈ నేపథ్యంలోనే 1987లో దేవాదాయ ధర్మాదాయ చట్టం తీసుకొచ్చారు.

ఇది ఆలయాల్లో అర్చక బాధ్యతలకు వంశపారంపర్య హక్కును తొల గించింది.

హారతి పళ్లెంలో వచ్చే చిల్లరను కూడా అర్చకులు తీసుకోవద్దని శాసించింది.

అర్చకులకు ఆలయాల్లో భక్తులు ఇచ్చే సంభావనలను అడ్డుకుంది. వాటిని హుండీ లో వేయించింది.

అర్చకులు ఎక్కడ ఓ రూపాయి కోసం ఆశపడాతారోనన్న అనుమానంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఈ చట్టం తమ జీవితాలను చిందరవందర చేసిందని అర్చకులంతా ఎన్టీఆర్‌కు మొరపెట్టుకున్నారు.

వాస్తవం గుర్తెరిగి అర్చకుల న్యాయమైన డిమాండ్లను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఎన్టీఆర్ వేశారు.

1995 ఆగస్టు 15న ఏర్పడిన ఈ కమిటీ నివేదిక సమర్పించే సమయానికి ఎన్టీఆర్‌ను దించేసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పరిస్థితి మరింత దారుణమైన స్థితికి చేరుకుంది.

చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏమాత్రం పట్టించుకోలేదు.
పైగా అర్చకులు, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు.

2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్‌మెంట్ స్కీంను పెట్టారు.

జీతాలు లేవు... పెన్షన్లు లేవు... రిటైర్‌మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు.

మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది.

దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి 2001, సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.http://community.ysrcongress.com/Welcome.aspx#/articles
Share this article :

0 comments: