జగన్ మామయ్యే సీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ మామయ్యే సీఎం

జగన్ మామయ్యే సీఎం

Written By news on Sunday, April 13, 2014 | 4/13/2014

జగన్ మామయ్యే సీఎంవీడియోకి క్లిక్ చేయండి
లక్కీబేబీ కుందనసాయి
గతంలో వైఎస్సార్‌తో  కలసి ఎన్నికల ప్రచారం


హైదరాబాద్: ‘జగన్ మామయ్య సీఎం కావాలి. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కర్నూలు, నందికొట్కూరు వస్తే జగన్ మామయ్యతో కలిసి ప్రచార రథం ఎక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా’ అని ‘వైఎస్సార్‌సీపీ లక్కీ బేబీ’ చెల్లా కుందనసాయి తెలిపింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ప్రచారం ప్రారంభించి కర్నూలు జిల్లా నందికొట్కూరులో ముగిం చారు. ఆ సమయంలో సీసీ కృష్ణారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె కుందనసాయిని వైఎస్ తన వద్ద కూర్చోబెట్టుకుని ప్రచారం సాగించారు. రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ‘నువ్వు వచ్చావంటే.. లక్కీ అమ్మా’ అంటూ వైఎస్ తాతయ్య తనను ప్రచారానికి పిలిచేవారని గుర్తు చేసుకుంది. నువ్వు వచ్చావంటే లక్కీ అమ్మా... ప్రభుత్వం మనదేన మ్మా.. వచ్చే ఎన్నికల్లో నువ్వు జగన్ మామయ్యతో కలసి ప్రచారం చేయాలంటూ అప్పట్లో వైఎస్ తనతో అనేవారని కుందనసాయి ‘సాక్షి’కి తెలిపింది.

అప్పటి నుంచి కుందనసాయికి లక్కీబేబీగా గుర్తింపు వచ్చింది. కుందనసాయి వైఎస్ ప్రచార రథంపైకి ఎక్కి బుల్లిబుల్లి మాటలతో అందర్నీ అకట్టుకునేది. ప్రస్తుతం కర్నూలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కుందనసాయి శనివారం తల్లిదండ్రులతో పాటు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. వైఎస్ తాతయ్య జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది. ‘ఈసారి కూడా తప్పకుండా నిన్ను రథంపై ఎక్కించి ప్రచారం చేస్తా’ అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని కుందనసాయి తెలిపింది.

 తాతయ్య మృతిని తట్టుకోలేకపోయా...

 వైఎస్ తాతయ్య మృతిచెందారని తెలిసి తట్టుకోలేకపోయానని కుందనసాయి కన్నీటి పర్యంతమైంది. తాను ఇడుపులపాయ వెళ్లి నివాళులర్పించానని చెప్పింది. జగన్ మామయ్య జైల్లో ఉన్నప్పుడు మాత్రం కలవలేకపోయానని బాధ పడింది. వైఎస్ అంటే తమకు మొదటి నుంచి అభిమానం అని కుందనసాయి తల్లిదండ్రులు కృష్ణారెడ్డి, మంజుల తెలిపారు. తమ బిడ్డ కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ వైఎస్ అమలు చేసిన పథకాలను వివరిస్తోందని చెప్పారు.
Share this article :

0 comments: