తొందరపడని వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొందరపడని వైఎస్ జగన్

తొందరపడని వైఎస్ జగన్

Written By news on Thursday, April 3, 2014 | 4/03/2014

తొందరపడని వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ విషయంలో తొందరపడటంలేదు. ప్రత్యర్ధులు అధికార దాహంతో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నప్పటికీ జగన్ ఆచితూచి ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుడు హామీలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగాలేరు. ప్రత్యర్థికి మల్లే తాను అబద్దాలు చెప్పనని కూడా ఆయన నిజాయితాగా చెబుతున్నారు.  అంతేకాకుండా ఆ మహనేత తండ్రి నుంచి తనకు సంక్రమించింది మాట తప్పకుండా ఉండటం - మడమతిప్పకుండా ఉండటం - నిజాయితీగా వ్యవహరించడం - విశ్వసనీయతేనని జగన్ సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఆయన ఇచ్చే హామీలే ఆయనపై  ప్రజలకు నమ్మకాన్ని మరింతగా  పెంచుతున్నాయి.

రాజకీయంగా తన ప్రధాన ప్రత్యర్థి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికార దాహంతో ఉచిత హామీలను ఊదరగొడుతున్నా జగన్ మాత్రం అమలు చేయడానికి సాధ్యమైన పథకాలను మాత్రమే ప్రవేశపెడతానని చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధితోపాటు రైతులు, మహిళలు, చేతివృత్తుల వారి సంక్షేమం - పిల్లల చదువులు - యువతకు చదువు, ఉద్యోగం - వృద్ధులు, వికలాంగులకు ఆసరా -  వైద్యం .... ఇలా అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన హామీలు ఇస్తున్నారు.

  ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన పది ప్రధాన హామీలు కూడా ఇవే విషయాలను స్పష్టం చేస్తున్నాయి.  ముఖ్యమంత్రిగా తాను పెట్టే తొలి పది సంతకాల గురించి జగన్ స్పష్టంగా వివరిస్తున్నారు.

వైఎస్ జగన్ తొలి పది సంతకాలు:

1.అక్కా చెల్లెళ్ల కోసం -ప్రతి విద్యార్థికీ నెలకు రూ. 500 చొప్పున తల్లి అకౌంట్ లో జమ.
2.అవ్వా తాతల కోసం-వృద్ధాప్య పింఛన్లను రూ. 200 నుంచి రూ. 700కు పెంపు.
3.రైతుల కోసం -  పండిన పంటకు గిట్టుబాటు ధర కోసం 3000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి.
4.మహిళల కోసం -రూ. 20,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాల మాఫీ.
5.పౌర సేవలు -    ప్రతి గ్రామంలో 24 గంటల్లో కార్డుల విడుదల కోసం కార్యాలయాలు.
6.ప్రజారోగ్యం -    ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రాజధానిలో 20 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు.
7.గృహనిర్మాణం - అయిదేళ్లలో 50 లక్షల ఇళ్లనిర్మాణం
8. విద్యుత్ సరఫరా - అయిదేళ్లలో కరెంటు కోతల్లేని రాష్ట్రం, రైతులకు పగలే ఏడు గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా.
9. మద్యం వద్దు - బెల్టు షాపుల మూసివేత, నియోజకవర్గానికి ఒకే మద్యం షాపు, మద్యం ధరలు కొనలేనంతగా పెంపు
10. యువత కోసం - తగినన్ని ఉద్యోగాల కల్పన

ఇంతేకాకుండా తమ ప్రభుత్వం ఏర్పడితే  నెలకు 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే పేద వారు వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. ఈ  హామీలే ఆయన విజయానికి సోపానాలు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్చే ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం దానిని నిర్విగ్నంగా కొనసాగించారు. అవే లక్షణాలు పుణికిపుచ్చుకున్న జగన్ కూడా తండ్రిలాగా తమ బాధలు తీర్చడానికి తొలి పది సంతకాలు చేస్తారన్నా ఆశతో జనం ఉన్నారు.

ఇక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో తన పాలనలో చేయనివి ఇప్పుడు చేస్తానని హామీలను గుప్పిస్తున్నారు. ఆయన పాలనతో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ప్రజలపై వివిధ రకాల పన్నుల భారం మోపారు.రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు.  వారు నానా కష్టాలపాలయ్యారు. . తొమ్మిదేళ్లపాటు ప్రజలంతా నరకయాతన అనుభవించారు. అధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా ప్రజలకు ఏదో ఒక  హమీ ఇస్తున్నారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అన్నీ తెలసి కూడా ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత? హామీలు నెరవేరడానకి ఎంత బడ్జెట్ కావాలి? ఎన్ని ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది? ఎన్ని కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయగలం?.... అనే విషయాలను ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ఉచిత హామీలను ఇస్తున్నారు. తన 9 ఏళ్ల పాలనను మళ్లీ అందిస్తానని మాత్రం చెప్పడంలేదు. చంద్రబాబు చెప్పేవి  నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరనిది స్పష్టం
Share this article :

0 comments: