నైతిక విలువలు లేని బాబును నమ్మకండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నైతిక విలువలు లేని బాబును నమ్మకండి

నైతిక విలువలు లేని బాబును నమ్మకండి

Written By news on Wednesday, April 30, 2014 | 4/30/2014

నైతిక విలువలు లేని బాబును నమ్మకండి
  •  అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు
  •  మతతత్వ పార్టీ అని అభివర్ణించిన బీజేపీతోనే పొత్తు
  •  బాబు పాలనలో ముస్లిం, మైనారిటీలకు రక్షణ కరువు
  •  జగనన్నతోనే అన్ని వర్గాల అభ్యున్నతి
  •  ప్రజాబాటలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి
  తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: నైతిక విలువలు లేని చంద్రబాబు అధికారం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటారని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి వెనకాడరని వైఎస్‌ఆర్ సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. తిరుపతి పరిధిలోని కొర్లగుంటలో పార్టీ నాయకుడు పీ అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అని, ముస్లిం, మైనారిటీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. కనీస నైతిక విలువలు లేని చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని హెచ్చరించారు.

 బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారుతారని, దీంతో మైనారిటీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. కలసికట్టుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకున్న సోనియాగాంధీకి పూర్తి సహకారం అందించిన ద్రోహులు కిరణ్, చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. వీరితో పాటు సోనియాగాంధీకి బీజేపీ అండగా నిలిచిందన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును సీమాంధ్రులు క్షమించరని చెప్పారు.

 మహానేత పేదల సంక్షేమం ఆకాంక్షించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో తిరిగి అందిస్తారన్నారు. ప్రజలంతా ఆలోచించి ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఐదేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి కష్టం రానివ్వకుండా జగనన్న చూసుకుంటారని చెప్పారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా ? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పారు.  పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్‌కే బాబు, కేతం జయచంద్రారెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, ఎస్‌గడీ. శేఖర్, ఎస్‌కే ముస్తఫా, శ్రీనివాసులురెడ్డి, దేవదానం, మబ్బు మధుసూదన్‌రెడ్డి, రాజేష్, బాల, పీపీ చావడి రఫీ, కల్యాణి, రత్నమ్మ పాల్గొన్నారు.


Share this article :

0 comments: